NTV Telugu Site icon

Sourav Ganguly: కోహ్లీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కి దాదా రియాక్షన్

Ganguly Unfollowed

Ganguly Unfollowed

Sourav Ganguly Unfollowed Virat Kohli On Instagram: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి మధ్య వివాదం కొనసాగుతూనే విషయం అందరికీ తెలిసిందే! ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. వీరి మధ్య గొడవ మరింత ముదిరేలా కనిపిస్తోందే తప్ప సద్దుమణిగేలా లేదు. రీసెంట్‌గానే ఆర్సీబీ, డీసీ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు వీళ్లిద్దరు పలకరించుకోకపోవడం.. మ్యాచ్ ముగిసిన అనంతరం షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంతో.. వీరిమధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఉన్నట్టు తేలింది. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని అన్‌ఫాలో కూడా చేసేశాడు. ఈ విషయంపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. ఇప్పుడు తాజాగా దాదా వంతు వచ్చింది. తనని అన్‌ఫాలో చేశాడు కాబట్టి.. దాదా కూడా కోహ్లీని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశాడు. దీంతో.. వీరి మధ్య వివాదం ముదిరి పాకాన పడినట్టు అయ్యింది.

Metro Train : మెట్రో రైలులో లేని సీటు..సోఫాతో ప్రయాణం చేస్తున్న యువకుడు

అసలు కోహ్లీ, గంగూలీ మధ్య విభేదాలు ఎందుకొచ్చాయి?
ఫామ్‌లేమితో సతమతమవుతున్న తరుణంలో విరాట్ కోహ్లీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2021లో టీ20 వరల్డ్‌కప్ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అయితే.. వన్డే, టెస్టుల్లో మాత్రం కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. కానీ.. ఇంతలోనే బీసీసీఐ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. ఆ రెండు ఫార్మాట్ల నుంచి కూడా కోహ్లీని తప్పించి, అతని స్థానంలో రోహిత్ శర్మని టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేసింది. అప్పుడు కోహ్లీ బహిరంగంగానే మండిపడ్డాడు. తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారని ఆరోపణలు గుప్పించాడు. అందుకు బదులుగా.. ఇది భారత క్రికెట్‌ బోర్డు, సెలక్టర్లు కలిసి తీసుకున్న నిర్ణయమని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్‌ గంగూలీ సమాధానమిచ్చాడు. అప్పటి నుంచే కోహ్లీ, గంగూలీ మధ్య విభేదాలు మొదలయ్యాయి.

Shama Sikander: లోపల బ్రా లేకుండా ఏంటీ షామా.. అవకాశాల కోసం ఇంతలా

Show comments