Sourav Ganguly: ఒక్క రోజులోనే ఎవ్వరూ అంబానీ, మోడీ కాలేరు.. గంగూలీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sourav Ganguly Sensational Comments on BCCI President Post: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సౌరవ్ గంగూలీ దిగిపోవడం దాదాపు ఖాయమైపోయింది. రెండోసారి ఆ పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నా, ఆయన తప్పుకుంటున్నాడు. ఈ పదవికి రోజర్ బిన్నీ ఒక్కడే నామినేషన్ దాఖలు కాబట్టి.. ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ 18న ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరిస్తాడని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం వెల్లడించారు. ఈ క్రమంలో సౌరభ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒక్క రోజులోనే ఏ ఒక్కరూ అంబానీ, మోడీ కాలేరంటూ అతడు చేసిన వ్యాఖ్యలు.. హాట్ టాపిక్‌గా నిలిచాయి.
‘‘ఇప్పటి వరకు నేను చాలా మంచి రోజులు ఆస్వాదించాను. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా చేశాను. ఇంకా గొప్ప పనులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నా. మీరు ఎప్పటికీ ఆటగాడిగా.. పాలకుడిగానూ ఉండలేరు. నేను మాత్రం ఈ రెండింటినీ చేశాను. అయితే.. ఒక్క రోజులోనే ఎవ్వరూ అంబానీ లేదా నరేంద్ర మోడీ కాలేరు. ఎన్నో సంవత్సరాలు కష్టపడితే గానీ ఆ స్థాయికి చేరుకోలేరు’’ అంటూ దాదా చెప్పుకొచ్చాడు. అలాగే తన కెప్టెన్సీపై స్పందిస్తూ.. తాను చేసిన పరుగులనే కాకుండా ఇతర విషయాలను సైతం అభిమానులు గుర్తు పెట్టుకున్నారన్నాడు. నాయకుడిగా జట్టును తాను నడిపించిన తీరు వారిని ఆకట్టుకుందని, ఇప్పటికీ అభిమానులు దాని గురించి ప్రస్తావించుకోవడం తనకు ఆనందాన్ని కలిగిస్తుందన్నాడు.
Also Read
- Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
- Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
కాగా.. భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ, ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత పశ్చిమ బంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా కొన్నాళ్లు పని చేశాడు. ఆ తర్వాత.. భారత క్రికెట్ బోర్డుకు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. రెండోసారి కూడా ఈ బాధ్యతలు స్వీకరిస్తాడని అంతా అనుకున్నారు కానీ, అనూహ్యంగా రోజర్ బిన్నీ అధ్యక్ష పదవి రేసులో వచ్చాడు. ఇప్పుడు గంగూలీ తీసుకోబోయే తదుపరి నిర్ణయం ఏంటి? అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?