ప్రస్తుతం భారత క్రికెట్ లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అలాగే విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దు అని తాను చెప్పినట్లు గంగూలీ ప్రకటించగా… ఆ వ్యాఖ్యలను కోహ్లీ కొట్టిపారేశారు. దాంతో వీరిద్దరి మధ్య వివాదం బయటకు వచ్చింది. అయితే తాజాగా గంగూలీ కోహ్లీని ప్రశంసించారు.
ఇక తాజాగా జరిగిన ఒక ఈవెంట్‌లో గంగూలీని… మీకు ఏ ఆటగాడి వ్యక్తిత్వం అంటే ఇష్టం అనే ప్రశ్నకు సమాధానమిస్తూ “విరాట్ కోహ్లీ వ్యక్తిత్వం అతను వైఖరి నాకు నచ్చుతుంది” అని చెప్పాడు. అలాగే దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే ముందు కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై గంగూలీ స్పందిస్తూ.. దానిపై నేను చెప్పడానికి ఏమీ లేదు. మేము దానిని పరిష్కరించుకుంటాము, దానిని బీసీసీఐకి వదిలివేస్తాము” అని భారత మాజీ కెప్టెన్ చెప్పాడు.