Site icon NTV Telugu

Sourav Ganguly: కోహ్లీకి ఆడితే చూడాలనుంది కానీ.. అది సాధ్యం కాకపోవచ్చు

Ganguly On Kohli

Ganguly On Kohli

Sourav Ganguly On Virat Kohli Form: చాలాకాలం నుంచి ఫామ్‌లేమితో సతమతమవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తిరిగి ఫామ్‌లోకి వస్తే చూడాలనుకుందని క్రికెట్ అభిమానులు సహా మాజీలు ఎంతో కోరుకుంటున్నారు. అతడు బరిలోకి దిగిన ప్రతీసారి.. ఫామ్‌లోకి వస్తాడన్న ఆశనే వ్యక్తపరిచారు. కానీ, కోహ్లీ నిరాశపరుస్తూనే ఉన్నాడు. అయితే.. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో ఆడనున్న తొలి మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ కచ్ఛితంగా రెచ్చిపోతాడని అందరూ ఆశిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ తప్పకుండా ఫామ్‌లోకి తిరిగొస్తాడని, ఈ సీజన్ అతనికి గొప్పగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

‘‘ఈసారి విరాట్ కోహ్లీ తప్పకుండా ఫామ్‌లోకి తిరిగొస్తాడని నమ్మకం ఉంది. ఈ సీజన్ అతనికి గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా. టీ20 వరల్డ్‌కప్‌కి ముందు ఆసియా కప్ 2022 రూపంలో అతనికి తన సత్తా చాటే గొప్ప అవకాశం లభించింది. అతడు కేవలం దేశం కోసం మాత్రమే కాదు.. తన కోసం తాను కూడా తప్పకుండా పరుగులు సాధించాల్సి ఉంటుంది. అందరిలాగే మేము కూడా కోహ్లీ శతకం బాదితే చూడాలనుకుంది. కానీ.. టీ20లలో సెంచరీ చేయడమన్నది అంత ఆషామాషీ విషయం కాదు. అందుకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే.. ఫామ్‌లోకి తిరిగి రావడానికి మాత్రం ఈ సీజన్ కోహ్లీకి సువర్ణవకాశమే అవుతుంది. ఈ సీజన్ అతనికి గుర్తుండిపోవాలని నేను కోరుకుంటున్నా’’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

Exit mobile version