India vs Pakistan Match: పాక్ డగౌట్‌లో పాము.. వీడియో వైరల్..

  • నేడు కొలంబో వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్..
  • సమరానికి సిద్ధమైన దాయాదులు..
  • మ్యాచ్‌కు ముందు పాక్ డగౌట్‌లో పాము..
  • వైరల్ అవుతున్న వీడియో..
Ind Vs Pak

Ind Vs Pak

India vs Pakistan Match: చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం కొలంబో వేదికగా టీ20 వరల్డ్ కప్ 2026లో హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగబోతోంది. దాయదుల సమరం కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల ఫ్యాన్స్ ఇప్పటికే శ్రీలంక రాజధానికి చేరుకున్నారు. క్రికెట్ మాజీలు కూడా మ్యాచ్‌కు హాజరు కాబోతున్నారు.

Read Also: Salman Ali Agha: “మా టీమ్‌కు తారీఖ్ ట్రంప్ కార్డ్‌ లాంటోడు”.. ఉస్మాన్ వివాదంపై పాక్ కెప్టెన్ రియాక్షన్..

ఇదిలా ఉంటే, మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ డగౌట్‌లో పాము కనిపించడం కలకలం సృష్టింది. శుక్రవారం సాయంత్రం పాక్ టీం ప్రాక్టీస్ కోసం వస్తున్న సమయంలో పాము కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రౌండ్ సిబ్బంది వెంటనే పామును అక్కడి నుంచి తొలగించారు.

అనేక రాజకీయాలు, బాయ్‌కాట్ వివాదాలు ముగిసిన తర్వాత భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. అయితే, కొలంబోలో వాతావరణ పరిస్థితులు చూస్తే, వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశం లేదని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది.