టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దైన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను నవంబర్ 23న స్మృతి వివాహం చేసుకోవాల్సి ఉండగా.. ఊహించని రీతిలో పెళ్లికి కొన్ని గంటల ముందు వాయిదా పడింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించడంతో పెళ్లి వాయిదా పడిందని, పలాష్ కూడా అనారోగ్యానికి గురయ్యాడని, డిసెంబర్ 7న ఇద్దరి వివాహం జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. డిసెంబర్ 7 మధ్యాహ్నం స్మృతి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసి.. పలాష్‌తో తన వివాహం రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
స్మృతి మంధాన తన పోస్ట్‌లో వివాహం ఎందుకు రద్దు అయిందో చెప్పలేదు. స్మృతి, పలాష్ ముచ్చల్ వివాహం వాయిదా పడినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని షాకింగ్ విషయాలు చక్కర్లు కొట్టాయి. పలాష్ ఓ అమ్మాయితో చాటింగ్ చేసిన కొన్ని స్క్రీన్‌షాట్‌లు కూడా వైరల్ అయ్యాయి. ఇదే పెళ్లి రద్దుకు అసలు కారణమని న్యూస్ వచ్చింది. తాజాగా మరో షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. సాంగ్లిలో వివాహానికి ముందు రోజు రాత్రి పలాష్ ఓ మహిళా క్రికెటర్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడట. పెళ్లికి ముందు రోజు రాత్రి ఫామ్‌హౌస్‌లో స్మృతి తన స్నేహితులతో సరదాగా గడుపుతోంది. ఈ సమయంలో ఓ ఊహించని దృశ్యం టీమిండియా క్రికెటర్ శ్రేయంకా పాటిల్ కంట పడిందట.
Also Read: Smriti Mandhana: చిన్నప్పటి నుంచే పిచ్చి.. ఎవరూ అర్థం చేసుకోలేదు!
కొరియోగ్రాఫర్ నందిక ద్వివేదితో పలాష్ ముచ్చల్ సన్నిహితంగా ఉండడం శ్రేయంకా పాటిల్ చూశారట. శ్రేయంకా వెంటనే విషయం స్మృతి చెప్పారట. స్మృతి కూడా పలాష్, నందికలను అసహ్యకరమైన స్థితిలో చూశారట. స్మృతి సోదరుడు పలాష్‌ను కొట్టగా.. గొడవ జరిగిందట. ఇదంతా జరిగినప్పుడు అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారట. ఉదయం స్మృతి తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, పెళ్లి వాయిదా పడిందని అందరికి చెప్పారట. పలాష్ ఆరోగ్య కారణాలను చూపుతూ అక్కడి నుంచి పారిపోయాడట. పలాష్ తన పరువు పోకుండా.. స్మృతిదే తప్పు అని చూపడానికి ఓ పీఆర్ కంపెనీకి భారీ మొత్తంలో డబ్బు కూడా చెల్లించాడని సమాచారం.
