Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sineth Jayawardena on His Century vs IND A: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో శ్రీలంక-ఏ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం దోహాలో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్-ఏపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 318 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 41.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంలో ఓపెనర్లు లసిత్ క్రాస్పుల్ (116; 107 బంతుల్లో 12×4, 3×6), సినెత్ జయవర్దన (105; 70 బంతుల్లో 10×4, 6×6) కీలక పాత్ర పోషించారు. క్రాస్పుల్ అజేయంగా నిలవగా.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సినెత్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. గత మ్యాచ్‌ల వైఫల్యాన్ని పక్కనపెట్టి.. కోచ్ ఇచ్చిన సలహాలను పాటిస్తూ కీలక సెమీఫైనల్లో సెంచరీ చేశా అని సినెత్ తెలిపాడు.
మ్యాచ్ అనంతరం సినెత్ జయవర్ధనే తన మెరుపు ఇన్నింగ్స్ వెనుక ఉన్న కారణాలను వెల్లడించాడు. ‘గత మూడు మ్యాచ్‌ల్లో పరుగులు చేయలేదు. దాంతో సెమీఫైనల్ నాపై కొంత ఒత్తిడి ఉంది. మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్‌తో మాట్లాడా. ఆయన నా ఆలోచనా విధానాన్ని మార్చుకోవడంలో సహాయపడ్డారు. కోచ్ సూచనలతో సానుకూల దృక్పథంతో మైదానంలోకి దిగా. అది నాకు బాగా ఉపయోగపడింది. మ్యాచ్‌కు ముందు ఫర్వేజ్ మహరూఫ్‌తో కూడా మాట్లాడాను. నేను పరుగులు చేయాల్సిన సమయం వచ్చిందని ఆయనతో చెప్పా. కోచ్‌లు కూడా నా ఆటపై నమ్మకం ఉంచాలని సూచించారు. నా సహజమైన ఆటను నమ్మి ఆడాలని కోచ్‌లు ఇచ్చిన సలహా ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది’ అని సినెత్ పేర్కొన్నాడు.
Also Read
- Tilak Varma: మాకు ఏదీ కలిసి రాలేదు.. ఆ ఇద్దరే మమ్మల్ని ముంచారు.. మనోళ్లు కూడా..!
- India A vs Sri Lanka A: చేతులెత్తేసిన బౌలర్లు.. భారత్ ఘోర పరాజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీలంక
- Sri Lanka Captain: వారి వల్లే విజయం సాధ్యమైంది.. శ్రీలంక కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..!
- IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
‘భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రత్యేకమైన వ్యూహాలేమీ అనుసరించలేదు. సహజమైన శైలిలో బ్యాటింగ్ చేయాలని, ప్రాథమిక అంశాలపై దృష్టి పెట్టాలని జట్టు యాజమాన్యం నేను, లసిత్ క్రాస్పుల్కు సూచించింది. అదే ప్రణాళికతో బరిలోకి దిగి లక్ష్యాన్ని సులభంగా చేరుకున్నాము. పిచ్ బ్యాటింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉంది. భారత జట్టు బ్యాటింగ్ చేసినప్పుడూ వికెట్ బాగానే ఉంది. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా బ్యాటింగ్‌కు పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. ముఖ్యంగా లెగ్‌సైడ్‌లో దూకుడుగా ఆడే షాట్లపై నేను కొంతకాలంగా ప్రత్యేకంగా సాధన చేస్తున్నా. అది కూడా పరుగులు చేయడానికి ఉపయోగపడింది. మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా.. ఈరోజు సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. మ్యాచ్ గెలిచినందుకు ఇంకా సంతోషంగా ఉంది’ అని సినెత్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!
-
AP Cabinet Meeting Today: రూ.88,392 కోట్ల పెట్టుబడులు.. 54 వేల మందికి ఉద్యోగాలు!
-
December 2026 Updates: కొత్త నెల, కొత్త రూల్స్.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న పెద్ద మార్పులివే!
-
AP Rain Alert: నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. పిడుగులు పడే అవకాశం!
-
BSNL సంచలనం.. రూ.51కే 56GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్..!
ట్రెండింగ్
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?