వంగవీటి రాధాకు కరోనా.. హైదరాబాద్‌కు తరలింపు..

తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు కాస్త తగ్గినా కోవిడ్‌ ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోవిడ్‌ టచ్‌ చేసింది.. సినీ పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోలు, హీరోయిన్లతో పాటు పలువురు కోవిడ్‌ బారినపడగా.. మరోవైపు రాజకీయ నేతలను కూడా కోవిడ్‌ వదలడం లేదు.. తాజాగా, తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణకు కరోనా పాజిటివ్‌గా తేలింది… దీంతో హైదరాబాద్‌లోని ఏఐజీలో చేరిన ఆయన.. చికిత్స తీసుకుంటున్నారు.. ఆయన కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నట్టు చెబుతున్నారు.

Read Also: విభజన సమస్యలపై ఇవాళే కీలక భేటీ

కాగా, ఈ మధ్యే ఏపీ రాజకీయాల్లో వంగవీటి రాధా ఎపిసోడ్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది.. వంగవీటి రంగ వర్థంతి సభలో రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని బాంబ్‌ పేల్చిన రాధా.. తననేదో చేద్దామని కుట్ర చేశారని.. దేనికీ భయపడేదిలేదని ప్రకటించారు.. తాను ప్రజల మధ్య ఉండే మనిషినని.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నానన్నారు.. ఇక, ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించడం.. ఆయన తిరస్కరించడం లాంటివి కూడా జరిగిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు, వంగవీటి రాధా త్వరగా కోవిడ్‌ నుంచి కోలుకుని పూర్తిస్థాయి ఆరోగ్యంతో తిరిగిరావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related Articles

Latest Articles