NTV Telugu Site icon

Shubman Gill: సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప..గిల్ తెలివైన సమాధానం

Gill

Gill

భారత క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకే సాధ్యమైన ఆటతో 20 ఏళ్ల పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. ఎవరికి సాధ్యం కానీ రికార్డుల్ని క్రియేట్ చేశాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ.. కెరీర్ మొత్తం 100 సెంచరీలతో పాటు అత్యధిక పరుగుల ఘనతను అందుకున్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సచిన్‌లానే నిలకడగా రాణిస్తూ.. ఒక్కో రికార్డును చెరిపేస్తున్నాడు. ఇటీవలే కెరీర్‌లో 73వ సెంచరీ చేసిన విరాట్.. సచిన్ 100 సెంచరీ రికార్డును అధిగమించే దిశగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే టాపిక్ నడుస్తోంది. ఇదే విషయమై స్పందిస్తూ యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ తెలివిగా సమాధానం చెప్పాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డే తర్వాత గిల్‌ను ఈ ప్రశ్న అడగగా ఇలా స్పందించాడు.

Siraj: నెంబర్‌వన్ బౌలర్‌గా సిరాజ్..ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ పేసర్ జోరు

“నా వరకు కోహ్లీనే బెస్ట్. ఎందుకంటే నేను విరాట్ ఆటను చూస్తూ పెరిగాను. సచిన్ సార్ వల్లే నేను క్రికెట్ ఆడడం మొదలు పెట్టా. సచిన్‌కు మా నాన్న వీరాభిమాని. అందుకే నన్ను క్రికెటర్‌గా మార్చాలని ఆయన కలలు కన్నారు. ఆయన క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్ తీసుకునే సమయానికి నేను ఇంకా చిన్న పిల్లాడినే. నేను క్రికెట్‌ను అర్థం చేసుకోవడం మొదలెట్టాక నాకున్న రోల్ మోడల్ విరాట్ భాయ్ మాత్రమే. విరాట్ ఆటను చూస్తూ పెరిగాను. కోహ్లీ బ్యాటింగ్ నుంచి ఎంతో నేర్చుకున్నా. అందుకే నాకు విరాట్ భాయ్ రోల్ మోడల్” అని గిల్ చెప్పుకొచ్చాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో గిల్(112) సెంచరీతో చెలరేగాడు. తద్వారా వన్డేల్లో 4వ సెంచరీ నమోదు చేసిన ఇతడు.. గత నాలుగు వన్డేల్లో ఓ డబుల్ సెంచరీతో పాటు రెండు శతకాలు బాదాడు. ముఖ్యంగా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ 208(149), 40 నాటౌట్(53), 112(78)‌లతో 360 పరుగులు చేశాడు. దాంతో ఓ వన్డే సిరీస్‌లో 300 ప్లస్ పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇక పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ రికార్డును సమం చేశాడు.

Show comments