Site icon NTV Telugu

Shubman Gill: అరుదైన రికార్డ్.. అప్పుడు సచిన్, ఇప్పుడు శుబ్‌మన్‌

Sachin Shubman Rare Records

Sachin Shubman Rare Records

నిన్న (మే10) లక్నో సూపర్ జెయింట్స్‌పై గుజరాత్ టైటాన్స్ సాధించిన విజయంలో శుబ్‌మన్‌ గిల్‌ కీలక పాత్ర పోషించాడు. ఇతర బ్యాట్స్‌మెన్స్‌ అంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరగా.. ఇతనొక్కడే 49 బంతుల్లో 7 ఫోర్లతో 69 పరుగులు చేసి, చివరివరకూ అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే సుధీర్ఘకాలం నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డ్‌ను అతడు అందుకున్నాడు.

2009లో చెన్నై సూపర్ కింగ్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 20 ఓవర్లపాటు క్రీజులో బ్యాటింగ్ చేసిన సచిన్.. 49 బంతుల్లో 7 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఆయన ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. ఇప్పుడు గిల్ కూడా గుజరాత్ టైటాన్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగి.. 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, ఒక్క సిక్స్ కూడా కొట్టకుండానే 7 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేశాడు. దీంతో.. సచిన్ తర్వాత ఐపీఎల్ చరిత్రలో 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి, ఒక్క సిక్సర్ కూడా కొట్టని రెండో బ్యాట్స్‌మెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు.

ఇదిలావుండగా.. టీ20ల్లో గిల్ టెస్ట్ బ్యాటింగ్ చేస్తాడనే అపవాదు ఉంది. అందుకే, మెగా వేలానికి ముందు గిల్‌ను కేకేఆర్ రిటెయిన్ చేసుకోలేదు. అయితే, గుజరాత్ టైటాన్స్ మాత్రం అతని మీద నమ్మకంతో, రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు కూడా అతనిపై అంత డబ్బు ఖర్చు చేయడం అనవసరమన్న విమర్శలు వచ్చాయి. వాళ్ళ నోళ్ళు మూయించేలా.. గిల్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో దూకుడుగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 384 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్ సాధించిన విజయాల్లో, శుబ్‌మన్‌ గిల్‌ దీ ప్రధాన పాత్ర ఉందని చెప్పుకోవడంలో సందేహం లేదు.

Exit mobile version