భారత క్రికెట్‌లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతూ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. శనివారం, అక్టోబర్ 4వ తేదీన సమావేశమైన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ, భారత వన్డే జట్టు కెప్టెన్‌గా యువ సంచలనం శుభ్‌మాన్ గిల్‌ను నియమించింది. వారాలుగా సాగుతున్న ఊహాగానాలకు ఈ ప్రకటనతో తెరపడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులో ఉన్నా కానీ కెప్టెన్సీ బాధ్యతలు గిల్‌పైనే పడ్డాయి.
Also Read :Mirai OTT : ఊహించిన దానికంటే ముందే OTTలోకి మిరాయ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న కీలకమైన ఆస్ట్రేలియా పర్యటన కోసం జట్టును ఎంపిక చేసేందుకు సమావేశమైన కమిటీ, ఈ సందర్భంగా కెప్టెన్సీ మార్పుపై కూడా దృష్టి సారించింది. భవిష్యత్తు అవసరాలు, జట్టు నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, వన్డే జట్టు నాయకత్వ బాధ్యతలను గిల్‌కు అప్పగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ కొత్త బాధ్యతతో గిల్ భారత జట్టును ఎలా నడిపిస్తాడో, ఆస్ట్రేలియా పర్యటనలో ఎలాంటి ఫలితాలు సాధిస్తాడో అని దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read :IND vs WI: వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్.. భారత్ ఘన విజయం
ఈ సంవత్సరం ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా శుభ్‌మాన్ గిల్‌ను టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఇక రోహిత్ శర్మ స్థానంలో జట్టు తదుపరి కెప్టెన్‌గా అతను బాధ్యతలు చేపట్టగలడనే ఊహాగానాలు వచ్చాయి. మరోపక్క ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా కొత్త టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలోనే జట్టును 2-2తో డ్రాగా నడిపించడమే కాకుండా, కెప్టెన్సీని కూడా భుజాన వేసుకుని జట్టులో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు, రికార్డు స్థాయిలో 754 పరుగులు చేశాడు. ఈ దెబ్బతో సెలెక్టర్లు, కోచ్ గౌతమ్ గంభీర్‌ను వన్డే ఫార్మాట్‌కు కూడా అతన్నే కెప్టెన్ గా పరిగణించేలా చేసింది.
