Gill Batting: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు పటాపంచల్..

Dfsdfsfsf

Dfsdfsfsf

లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, తన వన్డే కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. గిల్ కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు.

రోహిత్ శర్మ రికార్డు బద్దలు
భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా (తక్కువ బంతుల్లో) 150 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రికార్డును గిల్ అధిగమించాడు. రోహిత్ శర్మ గతంలో గౌహతిలో వెస్టిండీస్‌పై 117 బంతుల్లో 150 పరుగుల మార్కును అందుకోగా, గిల్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌పై కేవలం 108 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి రోహిత్ రికార్డును తిరగరాశాడు. భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా 150 రన్స్ చేసిన మూడో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు.

×
×
Ad

గిల్ పేరిట నమోదైన మరికొన్ని రికార్డులు..
వన్డేల్లో కెప్టెన్‌గా గిల్‌కు ఇది మొట్టమొదటి శతకం. మొత్తంగా వన్డే కెరీర్‌లో ఇది అతనికి 9వ సెంచరీ. దీనితో వన్డే సెంచరీల పరంగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ (9 సెంచరీలు) సరసన గిల్ చేరాడు. కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే 3000 వన్డే పరుగుల మైలురాయిని దాటిన గిల్, భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో శిఖర్ ధావన్ (72 ఇన్నింగ్స్) పేరిట ఉన్న రికార్డును గిల్ ఏకంగా 10 ఇన్నింగ్స్‌ల ముందే బ్రేక్ చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్) తర్వాత గిల్ రెండో స్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో 3000 పరుగులను అత్యంత తక్కువ బంతుల్లో (3016 బంతులు) పూర్తి చేసిన రెండో భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్ (2995 బంతులు) మొదటి స్థానంలో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గిల్ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, ఇషాన్ కిషన్ (125 పరుగులు) తో కలిసి ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోశాడు. లక్నో ఎండను సైతం లెక్కచేయకుండా గిల్ ఆడిన ఈ ఇన్నింగ్స్ అతని వన్డే సగటును దాదాపు 59 కి చేర్చింది.. ఇది భారత పురుషుల క్రికెట్ చరిత్రలోనే అత్యధికం కావడం విశేషం.