Site icon NTV Telugu

Shreyas-Gambhir Controversy: శ్రేయస్ అయ్యర్-గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలా?.. అంతా గౌతీ చేతుల్లోనే?

Shreyas Iyer Gambhir Controversy

Shreyas Iyer Gambhir Controversy

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చాక భారత క్రికెట్ వర్గాల్లో ఎప్పటికప్పుడు వివాదాల చర్చ నడుస్తోంది. గంభీర్-కోహ్లీ, గంభీర్-రోహిత్ మధ్య విబేధాలు అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో చర్చ నడిచింది. తాజాగా మరో చర్చ నడుస్తోంది. బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, గంభీర్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని ఆ చర్చల సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టులు ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి.

వైరల్ అవుతున్న కథనాల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్‌ పట్ల గౌతమ్ గంభీర్ అసంతృప్తిగా ఉన్నాడట. ఇద్దరి మధ్య బంధం సరిగా లేదని తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో ఇషాన్ కిషన్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవాల్సింది. కానీ ఆ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులో ఆడించారు. అర్ష్‌దీప్ సింగ్‌ను ఎంపిక చేయడం వెనుక అంతర్గత కారణాలున్నాయన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి. గంభీర్ హయాంలో శ్రేయస్‌కు సరైన అవకాశాలు ఇవ్వడం లేదన్న భావన సోషల్ మీడియాలో చర్చకు వస్తోంది.

Also Read: Sanju Samson: న్యూజిలాండ్‌ సిరీస్‌లో చెత్త ప్రదర్శన.. సంజు శాంసన్ రియాక్షన్ ఇదే!

మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్రపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘సూర్య కేవలం టాస్‌కు మాత్రమే కెప్టేనా?’ అన్న వ్యాఖ్యలు నెట్టింట వ్యక్తమవుతున్నాయి. కీలక నిర్ణయాలన్నీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. తొలిసారి భారత క్రికెట్ పూర్తిగా హెడ్ కోచ్ చేతుల్లో నడుస్తుందని అంటున్నారు. ఇలాంటి అంశాలపై బీసీసీఐ, టీమిండియా మేనేజ్‌మెంట్ లేదా సంబంధిత ఆటగాళ్ల నుంచి అధికారిక ప్రకటన ఎక్కడా లేదు.

Exit mobile version