Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. శ్రేయస్ సర్జరీ సక్సెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Undergoes Succesfull Surgery In London: వెన్ను నొప్పి కారణంగా టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కొంతకాలం నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే! చికిత్స కోసం లండన్‌కు వెళ్లిన అతనికి మంగళవారం సర్జరీ జరిగినట్లు తెలిసింది. ఈ సర్జరీ విజయవంతం అయ్యిందని సమాచారం. ఫలితంగా.. అతడు వన్డే వరల్డ్‌కప్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మెగా టోర్నీ అక్టోబర్‌లో జరగనుంది కాబట్టి.. అతడు ఫిట్‌గా తయారవ్వడం కోసం చాలా సమయమే ఉంది. ఈ లెక్కన.. అతడు తప్పకుండా వరల్డ్ కప్‌కి ఫైనల్ జట్టులోకి ఛాన్సులు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు.
Ice Cream Crime: ఐస్‘క్రైమ్’ స్టోరీ.. బాలుడు మృతి.. కేసులో షాకింగ్ నిజాలు
Also Read
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
కాగా.. వెన్ను నొప్పి కారణంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ శ్రేయస్ తొలి మ్యాచ్‌కి దూరమయ్యాడు. దాన్నుంచి కాస్త ఉపశమనం లభించడంతో.. రెండో టెస్టు మ్యాచ్‌కి అతడు అందుబాటులోకి వచ్చాడు. కానీ.. మూడో మ్యాచ్ ఆడుతున్న సమయంలో వెన్ను నొప్పి తిరగబెట్టడంతో, అతడు మధ్యలోనే జట్టు నుంచి నిష్క్రమించాడు. దీంతో అతడు ఆస్ట్రేలియా సిరీజ్‌కి పూర్తిగా దూరమయ్యాడు. ఐపీఎల్-2023 సీజన్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలోనే అతడు సర్జరీ కోసం లండన్ వెళ్లాడు. ఇప్పుడు ఆ సర్జరీ సక్సెస్ కావడంతో.. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకొని, ఫిట్‌నెస్ టెస్టులు ప్రారంభించనున్నాడు. అతనికి పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు మూడు నెలల సమయమైతే తప్పకుండా పడుతుంది. తద్వారా.. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అయ్యర్ దూరం కావడం ఖాయం.
Virat Kohli: విరాట్ కోహ్లీ ప్రభంజనం.. ఒకే దెబ్బకు నాలుగు రికార్డులు
అయితే.. వన్డే వరల్డ్‌కప్ – 2023 అక్టోబర్ నెలలో జరగనుంది. అంటే.. ఐదు నెలల సమయం ఉంది కాబట్టి, ఆలోపు అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించొచ్చు. అదే జరిగితే.. ఈ మెగా టోర్నీకి అతడు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. మన టీమిండియా టాపార్డర్ బాగానే ఉంది కానీ.. మిడిలార్డరే బలహీనంగా ఉంది. అలాంటప్పుడు శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాడు జట్టుకు ఎంతో అవసరం. కావున.. వరల్డ్‌కప్ టోర్నీలోపు అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి, జట్టులోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!