Site icon NTV Telugu

IPL : అయ్యో అయ్యర్.. కేకేఆర్ పరిస్థితి ఆగం

Iyer

Iyer

మరో రెండు వారాల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. కానీ ఈ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు భారీ షాక్ తప్పేట్టు లేదు.. బీసీసీఐ వర్గాల నుంచి అందుతున్న సమచారాం ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ నడవడానికి కూడా ఇబ్బందిపడుతున్నాడని తెలుస్తోంది. వెన్నునొప్పితో బాధపడుతున్న అయ్యర్.. అహ్మదాబాద్ టెస్టులో భారత ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ కు కూడా రాలేదు.. టెస్టు మ్యాచ్ జరుగుతున్న క్రమంలోనే అతడిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఏడాది న్యూజిలాడ్ సిరీస్ కు ముందు వెన్నునొప్పితో దూరమైన అయ్యర్.. ఆస్ట్రేలియాతో సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో కూడా ఆడలేదు..

Also Read : Rapper Costa Titch: పాట పాడుతూ.. వేదికపైనే కుప్పకూలిన ర్యాపర్

ఇక అహ్మదాబాద్ టెస్టులో నాలుగో రోజే టెస్టు మ్యాచ్ సందర్భంగా అయ్యర్ ను వైద్య పరీక్షల నిమిత్తం పంపించగా ప్రస్తుతం అతడు నడవలేని పరిస్థితిలో ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న అయ్యర్.. ఇక ఐపీఎల్ లో కూడా ఆడేది అనుమానంగానే ఉంది. ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అయ్యర్.. వెన్ను గాయానికి శస్త్రచికిత్స అవసరమని తేల్చినట్టు సమాచారం. ఇదే నిజమైతే అతను.. మూడు నుంచి నాలుగు నెలల పాటు గ్రౌండ్ లోకి అడుగుపెట్టడం కష్టమేనని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

Also Read : Harbhajan Singh : సీఎస్కేకు ఆయన గుండెకాయ.. మా బలం.. బలగం: భజ్జీ

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అయ్యర్ రెండు, మూడు టెస్టు మ్యాచ్ లలో ఆడాడు.. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడతంలో విసలమయ్యాడు.. కాగా అయ్యర్ కు శస్త్రచికిత్స అవసరమని తేలితే మాత్రం అది ఐపీఎల్ లో కేకేఆర్ కు భారీ షాక్ తగులుతుంది. గత సీజన్ కు ముందు జరిగిన వేలం ప్రక్రియలో కేకేఆర్ అయ్యర్ ను రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. అతడిని సారథిగా కూడా నియమించింది. ఇక అయ్యర్ కు సర్జరీ అవసరమైనా లేక కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలనుకున్నా అది కేకేఆర్ కు మాత్రం పెద్ద నష్టమే. రెగ్యూలర్ సారథి లేకుండానే ఆ జట్టు 2023 సీజన్ బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ లు గాయాల కారణంగా ఐదారు నెలల పాటు భారత జట్టుకు దూరంగా ఉండనున్న నేపథ్యంలో తాజాగా అయ్యర్ కు కూడా సర్జరీ అవసరమైతే మరో కీలక ప్లేయర్ మిక్ కానున్నాడు.

Exit mobile version