Site icon NTV Telugu

ICC T20 Rankings: అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్.. పడిపోయిన కోహ్లీ ర్యాంక్

ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ అదరగొట్టాడు. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో వీర విహారం చేసిన అతడు ఏకంగా 27 ర్యాంకులు మెరుగై 18వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు విరాట్‌ కోహ్లీ టాప్‌-10 నుంచి పడిపోయాడు. దీంతో కోహ్లీ 15వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరోవైపు టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండు ర్యాంకులు తగ్గి 13వ ర్యాంకులో ఉన్నాడు. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ ఒక ర్యాంకు తగ్గి పదో స్థానానికి పరిమితం అయ్యాడు. బ్యాటింగ్ విభాగంలో టాప్-1లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ కొనసాగుతున్నాడు.

అటు బౌలర్ల విషయానికి వస్తే టీమిండియా ప్రధాన బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ మూడు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. టాప్-10 ఇండియా బౌలర్లకు చోటు దక్కలేదు. టాప్-1లో న్యూజిలాండ్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా బౌలర్ హేజిల్‌వుడ్ కొనసాగుతున్నాడు. టాప్-10లో ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఐదో స్థానంలో, రషీద్ ఖాన్ 9వ స్థానంలో నిలిచారు. కాగా శ్రీలంకతో సిరీస్‌లో 174 స్ట్రైక్‌రేట్‌తో శ్రేయాస్ అయ్యర్ 204 పరుగులు చేసి విరాట్‌ కోహ్లీ లేని లోటు తీర్చేశాడు.

Exit mobile version