Site icon NTV Telugu

Shreyas Iyer Health Update: ఐసీయూ నుంచి బయటికి వచ్చిన శ్రేయస్ అయ్యర్.. డాక్టర్లు ఏం చెప్పారంటే..!

Shreyas Iyer Injury

Shreyas Iyer Injury

Shreyas Iyer Health Update: శ్రేయస్ అయ్యర్ అభిమానులకు గుడ్ న్యూస్. పలు నివేదికల ప్రకారం.. శ్రేయస్ అయ్యర్‌ను ఐసీయూ నుంచి వార్డ్‌కు షిఫ్ట్ చేశారు. 31 ఏళ్ల ఈ బ్యాట్స్‌మన్ క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. బీసీసీఐ శ్రేయస్‌ను నిశితంగా పరిశీలించడానికి ఒక వైద్యుడిని ప్రత్యేకంగా నియమించింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో క్యాచ్ పట్టడానికి వెనక్కి పరిగెడుతుండగా శ్రేయస్ అయ్యర్ కిందపడి తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. ఈ 31 ఏళ్ల ఇండియన్ క్రికేటర్ భారతదేశానికి తిరిగి రావడానికి ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించే ముందు కనీసం ఒక వారం పాటు సిడ్నీ ఆసుపత్రిలో ఉండనున్నాడు. శ్రేయస్ భారత T20 జట్టులో సభ్యుడు కాదు.

READ ALSO: చేతికి పని చెప్పకుండా ఇంటిని మెరిపించేయండి.. Mecturing MopX2 రోబోట్ వాక్యూమ్ లాంచ్..!

డ్రెస్సింగ్ రూమ్ నుంచి ఆస్పత్రికి..
అయ్యర్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకొచ్చిన తర్వాత BCCI వైద్య బృందం తన పరిస్థితిని అంచనా వేసి వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని నిర్ణయించింది. వెంటనే జట్టు వైద్యుడు, ఫిజియోలు ఎటువంటి ఆలస్యం చేయకుండా శ్రేయస్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయ్యర్ పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం. ఆస్పత్రికి తరలించిన తర్వాత నిర్వహించిన స్కాన్లలో అయ్యర్ ప్లీహము (ఎడమ పక్కటెముక క్రింద, పొత్తి కడుపు పైభాగంలో ఉన్న మృదువైన స్పాంజి లాంటి అవయవం) కు కోత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం శ్రేయస్ చికిత్స పొందుతున్నాడని, బాగా కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. సిడ్నీ – భారతదేశంలోని నిపుణులతో సంప్రదించి BCCI వైద్య బృందం అయ్యర్ గాయాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. టీమిండియా జట్టు వైద్యుడు రిజ్వాన్ ఖాన్ ఈ వైద్య బృందంతో కలిసి అయ్యర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు వీసా ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత, అయ్యర్ కుటుంబ సభ్యులు ముంబై నుంచి సిడ్నీకి వెళ్లవచ్చని సమాచారం.

READ ALSO: Bangladesh map Controversy: బంగ్లాదేశ్‌ మ్యాప్‌లో భారత ఈశాన్య రాష్ట్రాలు.. ఇది కండకావరమే!

Exit mobile version