NTV Telugu Site icon

IND vs SL: టీమిండియా దూకుడు.. మరో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది.. ఈ సీజన్‌లో ఇప్పటికే న్యూజిలాండ్, వెస్టిండీస్‌ను వైట్‌వాష్‌ చేసిన రోహిత్‌ సేన.. ఇప్పుడు శ్రీలంక ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండా చేసింది.. ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి సొంతగడ్డపై వరుసగా మూడో సిరీస్‌నూ క్లీన్‌స్వీప్‌ చేసింది భారత జట్టు. ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి టీమిండియా ముందు 147 పరుగుల టార్గెట్‌ పెట్టింది.. ఇక, ఆ తర్వాత వైట్‌వాష్‌ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 16.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి విక్టరీ కొట్టింది.. శ్రేయస్‌ అయ్యర్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డులు అందుకున్నాడు.

Read Also: Jagananna Thodu: గుడ్‌ న్యూస్‌.. ఇవాళే వారి ఖాతాల్లోకి సొమ్ము

స్కోరు బోర్డు: శ్రీలంక బ్యాటింగ్‌… నిసాంక 1; గుణతిలక డకౌట్‌, అసలంక 4, లియనాగె 9, చండిమాల్‌ 22, షనక (నాటౌట్‌) 74, కరుణరత్నే (నాటౌట్‌) 12 పరుగులు చేయగా.. ఎక్స్‌ట్రాల రూపంలో 24 పరుగులతో కలిపి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేశారు.. ఇక, భారత్‌ బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. మ్సన్‌ 18, రోహిత్‌ శర్మ 5, శ్రేయస్‌ అయ్యర్‌ (నాటౌట్‌) 73, దీపక్‌ హుడా 21, వెంకటేష్‌ 5, జడేజా (నాటౌట్‌) 22.. ఎక్స్‌ట్రాలు 4తో కలిపి.. 16.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి టార్గెట్‌ ఛేదించి విజయాన్ని అందుకుంది రోహిత్‌ సేన.

https://www.youtube.com/watch?v=9Akmu_c3ujY