Site icon NTV Telugu

Team india: డాట్ బాల్స్ అతి పెద్ద నేరం అంటున్న యువ ఆటగాడు

టీమిండియా విషయానికి వస్తే ఇటీవల జట్టులో సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతడు శ్రేయాస్ అయ్యర్ మాత్రమే. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ విజృంభించాడు. వరుసగా మూడు మ్యాచుల్లోనూ అర్ధశతకాలు చేయడమే కాకుండా.. నాటౌట్‌గా కూడా నిలిచాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో ఆటడం ఎంత కష్టంగా ఉంటుందో అయ్యర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. పొట్టి ఫార్మాట్‌లో డాట్ బాల్స్ ఆడటం తన దృష్టిలో పెద్ద నేరమని చెప్పాడు.

ఎందుకంటే టీ20 ఫార్మాట్‌లో ప్రతి డాట్ బాల్ బ్యాటింగ్ చేసే వ్యక్తిని మరింత ఒత్తిడిలోకి నెడుతుందని శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. అలాగే ఆటగాళ్లకు ‘ఇంటెంట్’ చాలా ముఖ్యమని, ప్రతి బంతికి పరుగులు చేయాలనే కసితో ఉండాలన్నాడు. అలాగే శ్రీలంక సిరీస్‌లో తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు అయ్యర్ వివరించాడు. టీమిండియా బ్యాటింగ్ విభాగం చాలా బలంగా ఉందని.. అందుకే స్వేచ్ఛగా తాను బ్యాటింగ్ చేసినట్లు పేర్కొన్నాడు. కొన్నిసార్లు పరుగులు తక్కువ చేసినా తమ ఇంటెంట్ మాత్రం ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉండేలా చూసుకోవడం ఆటగాడికి ముఖ్యమన్నాడు.

Exit mobile version