Shreyas Iyer: అప్పుడు నాకు మరో ఆప్షన్ లేదు.. ఒక ఓవర్‌తో అతడిని నిందించొద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer on India Win vs Afghanistan 1st T20I: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆదివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగి అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్‌ను 20 ఓవర్లలో 156/8 పరుగులకే పరిమితం చేసింది. అనంతరం 13.4 ఓవర్లలోనే మూడు వికెట్స్ కోల్పోయి 157 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విజయంలో అభిషేక్ శర్మ (82; 32 బంతుల్లో 7×4, 7×6), ఇషాన్ కిషన్ (42; 33 బంతుల్లో 5×4, 1×6), అర్ష్‌దీప్ సింగ్ (3/19) కీలక పాత్ర పోషించారు.
మ్యాచ్ అనంతరం భారత టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలర్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. ‘బౌలింగ్ విభాగం సమష్టిగా రాణించింది. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవడం వల్లే అఫ్గానిస్థాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగాము. టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా గొప్ప ఆస్తి. బుమ్రా ఇచ్చిన ఆరంభం మిగతా బౌలర్లకు మంచి ఊపును అందించింది. అర్ష్‌దీప్ సింగ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తమ వంతు పాత్రను సమర్థంగా పోషించారు. బౌలర్ల సమష్టి కృషి అద్భుతం’ అని సర్పంచ్ సాబ్ ప్రశంసించాడు. మ్యాచ్‌లో జట్టంతా ఒకే లక్ష్యంతో పనిచేయడం విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను శివమ్ దూబేకి ఇవ్వడంపై శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ.. ఆ సమయంలో మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపాడు. ’20వ ఓవర్లో బౌలింగ్‌కు రావడంతో పిచ్ వేగాన్ని, బంతి ఎలా స్పందిస్తుందో పూర్తిగా అంచనా వేయడం దూబేకు కష్టమై ఉండొచ్చు. భారీగా రన్స్ ఇవ్వడం క్రికెట్లో భాగమే. దూబే కూడా ఆ ఓవర్‌ను విశ్లేషించుకుని మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై దృష్టి పెడతాడు. ఒక ఓవర్ ఆధారంగా ఆటగాడిని నిందించొద్దు’ అని చెప్పాడు. 20వ ఓవర్ వేసిన దూబే 21 పరుగులు ఇచ్చాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు సిక్సులు బాధగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు ఫోర్లు బాదాడు.
భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ ప్రస్తుత ఫామ్‌పై కూడా శ్రేయస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. ఇషాన్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడని, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ, ప్రాక్టీస్ సెషన్లలోనూ చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడని చెప్పాడు. ‘ఇషాన్ ప్రస్తుతం తన ఆటపై చాలా స్పష్టతతో ఉన్నాడు. అతడు చాలా రిలాక్స్డ్గా, ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. తన ఆట ఏంటో అతడికి ఇప్పుడు బాగా తెలుసు. ఇది జట్టుకు చాలా మంచి సంకేతం’ అని శ్రేయస్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన షాట్లను శ్రేయస్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. అతడి బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉందని, ఎక్కడా చిన్న పొరపాటు చేయలేదని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..