Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Creates History As First Indian T20I Captain: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మంగళవారం రాత్రి లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 14.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ విజయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 43 బంతుల్లోనే 102 పరుగులతో అజేయంగా నిలిచిన శ్రేయస్.. టీ20 కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. అంతేకాదు ఈ ఇన్నింగ్స్‌తో భారత టీ20 కెప్టెన్ల జాబితాలో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
మొదటి కెప్టెన్‌గా రికార్డు:
టీ20ల్లో భారత కెప్టెన్‌గా సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు లక్ష్య ఛేదనలో సెంచరీ చేసిన తొలి భారత టీ20 కెప్టెన్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు భారత కెప్టెన్లలో ఎవరూ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయలేదు. అంతకుముందు టీ20ల్లో లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్‌గా అత్యధిక స్కోరు చేసిన రికార్డు కింగ్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. 2019లో హైదరాబాద్‌లో వెస్టిండీస్‌పైనే కోహ్లీ 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇప్పుడు అదే ప్రత్యర్థిపై శ్రేయస్ 102 పరుగులతో అజేయంగా నిలిచి ఆ రికార్డును అధిగమించాడు.
Also Read
- Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
రోహిత్ శర్మ ఖాతాలో రెండు సెంచరీలు:
భారత్ తరఫున టీ20ల్లో కెప్టెన్‌గా సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ ఖాతాలో రెండు సెంచరీలు ఉన్నాయి. 2024లో బెంగళూరులో అఫ్గానిస్థాన్‌పై రోహిత్ 121 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు 2017లో ఇండోర్‌లో శ్రీలంకపై 118 పరుగులు చేశాడు. 2018లో లక్నోలో వెస్టిండీస్‌పై 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 2023లో జోహన్నెస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాపై 100 పరుగులు చేశాడు. తాజాగా శ్రేయస్ అయ్యర్ వెస్టిండీస్‌పై 102 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఈ జాబితాలో చేరాడు. ఈ జాబితాలో శ్రేయస్ సాధించిన 102 పరుగుల ప్రత్యేకత ఏమిటంటే.. ఇది లక్ష్య ఛేదనలో వచ్చిన సెంచరీ కావడం. శ్రేయస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. తొలి టీ20లోనే కెప్టెన్‌గా సెంచరీ చేయడంతో పాటు అరుదైన రికార్డును సొంతం చేసుకున్న శ్రేయస్‌కు ఇది ప్రత్యేకమైన మ్యాచ్‌గా నిలిచింది.
భారత టీ20 కెప్టెన్‌గా సెంచరీలు చేసిన లిస్ట్:
రోహిత్ శర్మ – 121* vs అఫ్గానిస్థాన్, బెంగళూరు, 2024
రోహిత్ శర్మ – 118 vs శ్రీలంక, ఇండోర్, 2017
రోహిత్ శర్మ – 111* vs వెస్టిండీస్, లక్నో, 2018
శ్రేయస్ అయ్యర్ – 102* vs వెస్టిండీస్, లక్నో, 2026
సూర్యకుమార్ యాదవ్ – 100 vs దక్షిణాఫ్రికా, జోహన్నెస్‌బర్గ్, 2023
తాజావార్తలు
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?