NTV Telugu Site icon

Shreyanka Patil CPL: చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్.. తొలి ప్లేయర్‌గా రికార్డ్!

Shreyanka Patil

Shreyanka Patil

Shreyanka Patil to Play for Guyana Amazon Warriors in CPL: భారత యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌ అరుదైన ఘనత సాధించింది. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకు పురుషుల లేదా మహిళల క్రికెట్‌లో ఎవరూ కూడా సీపీఎల్‌లో భాగం కాలేదు. సీపీఎల్‌ ఆడనున్న తొలి టీమిండియా ప్లేయర్ శ్రేయాంకనే. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడని శ్రేయాంక.. సీపీఎల్‌ ఆడే ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల ముగిసిన మహిళల ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అత్యధిక వికెట్స్ పడగొట్టిన బౌలర్‌గా నిలిచింది.

సీపీఎల్‌లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ ఫ్రాంచైజీ 21 ఏళ్ల శ్రేయాంక పాటిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఎడిషన్ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనుంది. భారత మహిళల జట్టులోని చాలా మంది క్రీడాకారులు విదేశీ టీ20 లీగ్‌లలో ఆడారు. హర్మన్‌ప్రీత్ కౌర్‌, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్‌లతో సహా పలువురు క్రీడాకారులు ‘ది హండ్రెడ్’, బిగ్ బాష్ లీగ్‌లో ఆడారు. విదేశీ లీగ్‌ల్లో పాల్గొనడంపై భారత పురుషుల క్రికెటర్లపై ఉన్న అంక్షలు మహిళా క్రికెటర్లపై లేవనే విషయం తేగలిసిందే.

20 ఏళ్ల స్పిన్‌ అల్‌రౌండర్‌ అయిన శ్రేయాంక పాటిల్‌ మహిళ ఐపీఎల్‌ ద్వారానే వెలుగులోకి వచ్చింది. ఆపై ఏసీసీ మహిళల ఎమర్జింగ్‌ టీమ్స్‌ కప్‌లో సత్తాచాటి లీగ్‌ క్రికెట్‌లో విదేశీ ఫ్రాంచైజీల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే సీపీఎల్‌లో అవకాశం దక్కించుకుంది. స్టెఫానీ టేలర్‌ నేతృత్వంలో గయానా ఆమెజాన్‌ వారియర్స్‌కు శ్రేయాంక ఆడనుంది. ఆర్సీబీ ప్లేయర్స్ సుజీ బేట్స్‌, సోఫీ డివైన్‌లను కూడా ఆమెజాన్‌ తరఫున ఆడనున్నారు. ఈ లీగ్‌లో మొత్తంగా 3 జట్లు పాల్గొంటాయి. లీగ్‌ దశలో ఒక్కో జట్టు మిగతా జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది.

Also Read: Ravindra Jadeja Rapid Fire: టీమిండియాలో బెస్ట్‌ స్లెడ్జర్‌ ఎవరు?.. రవీంద్ర జడేజా సమాధానం ఇదే!

Also Read: Pawan Kalyan: కథ నచ్చకపోతే కాల్చేస్తారా?.. పవన్ కల్యాణ్‌ను అడిగిన డైరెక్టర్!