Shoib Akthar: అక్తర్ నోటి దురుసు.. వచ్చేవారం ఇండియా కూడా ఇంటికి రావడం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shoib Akthar: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడటంతో తర్వాతి మూడు మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ గెలిచినా సెమీస్ అవకాశం దక్కుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. పాకిస్థాన్ దాదాపుగా ఇంటికి వెళ్లినట్లే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అద్భుతాలు జరిగితే తప్ప పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశం దక్కేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ నుంచి వరుస ఓటములు ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఫైర్ అవుతున్నాడు. తాజాగా టీమిండియాపై కూడా అక్తర్ తన అక్కసు వెళ్లగక్కాడు. తన జట్టు ఓడిపోతుందన్న బాధ కాకుండా టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ మేరకు భారత్ తీస్ మార్ ఖాన్ ఏం కాదని, వచ్చే వారమే ఆ జట్టు కూడా ఇంటికి వచ్చేస్తుందని అక్తర్ జోస్యం చెప్పాడు.
Also Read
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
అటు టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ భవితవ్యం ఏంటో టోర్నీకి ముందే చెప్పానని షోయబ్ అక్తర్ గుర్తుచేశాడు. అందరూ అనుకున్నట్లుగానే పాకిస్థాన్ ఇంటిముఖం పట్టిందని.. టీమిండియాకు కూడా ఇదే గతి పడుతుందని అక్తర్ ప్రకటించాడు. అంటే టీమిండియా సెమీస్‌కు వెళ్లి అక్కడి నుంచి ఓడిపోయి ఇంటికి చేరుతుందని అక్తర్ అభిప్రాయపడుతున్నాడు. కానీ చాలా మంది అభిమానులు భారత్ ఈ ప్రపంచకప్ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు పాకిస్థాన్ సెలక్టర్లు ఈ ప్రపంచకప్‌కు సరైన ఆటగాళ్లను ఎంపిక చేయలేదని అతడు ఆరోపించాడు. పీసీబీ దీనికి బాధ్యత వహించాలని అక్తర్ డిమాండ్ చేశాడు. కాగా జింబాబ్వే చేతిలో ఓటమిని పాకిస్థాన్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థాన్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ జింబాబ్వేతో మ్యాచ్ అనంతరం బోరున కన్నీటిపర్యంతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాదాబ్ ఖాన్ కింద కూర్చుని ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని బోరున విలపించడం వీడియోలో కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..