Site icon NTV Telugu

Shikar Dhawan: శార్దూల్ జెర్సీతో బ్యాటింగ్ చేసిన ధావన్.. బీసీసీఐపై నెటిజన్‌ల సెటైర్లు

Dhawan Jersey

Dhawan Jersey

Shikar Dhawan: జింబాబ్వేతో మూడో వన్డేలో శార్దూల్ ఠాకూర్ జెర్సీతో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు 42వ నంబర్ జెర్సీ ధరించాల్సిన ధావన్ 54వ నంబర్ జెర్సీ ధరించాడు. అయితే జెర్సీపై శార్దూల్ ఠాకూర్ పేరు కనపడకుండా టేప్ అతికించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓపెనర్‌గా శార్దూల్ వచ్చాడేమో అని అనుకున్నామని కొందరు నెటిజన్‌లు కామెంట్ చేశారు. ప్రపంచంలోనే ధనిక క్రికెట్‌ బోర్డు అయిన బీసీసీఐ ఆటగాళ్లకు సరిపడా జెర్సీలను ఎందుకు అందించలేకపోతుందో అర్థం కావడం లేదంటూ మరికొందరు పోస్టులు చేశారు. అయితే ధావన్ తన జెర్సీ కాకుండా శార్దూల్ ఠాకూర్ జెర్సీ ఎందుకు ధరించాడన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ కూడా బరిలోకి దిగాడు. అతడి రిజర్వ్ జెర్సీని ధావన్ ధరించినట్లు తెలుస్తోంది.

Read Also: India vs Zimbabwe: భారత్ క్లీన్ స్వీప్.. ముచ్చెమటలు పట్టించిన సికందర్

అటు గత నెలలో వెస్టిండీస్ పర్యటనలోనూ ఓ ఆటగాడి జెర్సీని మరొకరు ధరించిన దాఖలాలు ఉన్నాయి. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో దీపక్‌ హుడా ప్రసిద్ధ్‌ కృష్ణ జర్సీని ధరించగా.. మరో ఇద్దరు ఆటగాళ్లు పేసర్‌ ఆర్ష్‌దీప్‌ సింగ్‌ జర్సీ ధరించి కన్పించారు. ఇలా ఆటగాళ్లు జెర్సీలు మార్చుకోవడంపై బీసీసీఐ వివరణ ఇవ్వాల్సి ఉంది. కాగా జింబాబ్వేతో మూడో వన్డే ముగిసిన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఆటగాళ్లు డ్యాన్సులు వేస్తూ రచ్చ రంబోలా చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన నార్వే గ్రూప్ డ్యాన్స్‌ను అనుకరిస్తూ.. ఆటగాళ్లు కదం తొక్కారు. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ ‘కాలా చష్మా’కు అదిరిపోయే స్టెప్పులేస్తూ సిరీస్ విజయాన్ని ఆస్వాదించారు. భారత సంబరాల వీడియోను వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ‘మేము మా విజయాన్ని ఇలా జరుపుకున్నాం’ అని ధావన్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం డ్రెస్సింగ్ రూంలో ఇషాన్ కిషన్‌తో పాటు పలువురు ఆటగాళ్లు వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Exit mobile version