Shane Watson On Kohli Ganguly Issue: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే! తనని వన్డే, టెస్ట్ కెప్టెన్‌గా తొలగించినప్పటి నుంచి.. వీరిద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంత వాడీవేడీ వ్యవహారం నడుస్తోంది. ఓ సందర్భంలో.. తనకు తెలియకుండానే ఆ రెండు ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తొలగించారంటూ కోహ్లీ బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. ఇక రీసెంట్‌గా ఆర్సీబీ, డీసీ మ్యాచ్ నేపథ్యంలో ఇద్దరు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో.. వీరి మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే.. వీరి గొడవ గురించి అందరూ చర్చించుకుంటున్నారు.
Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. శ్రేయస్ సర్జరీ సక్సెస్
ఇప్పుడు లేటెస్ట్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, ఢిల్లీ జట్టు అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తనకు స్పష్టత లేదంటూ.. కోహ్లీ కడుపులో మంట ఉండొచ్చంటూ బాంబ్ పేల్చాడు. ది గ్రేడ్ క్రికెటర్ పోడ్‌క్యాస్ట్ కార్యక్రమంలో షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. ‘‘కోహ్లీ, గంగూలీ మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. ఈ మధ్య వారి వివాదంపై కొన్ని పుకార్లైతే వింటున్నాను. కానీ.. సరిగ్గా ఏం జరిగిందో స్పష్టత లేదు కాబట్టి, వారి వ్యవహారంలో జోక్యం చేసుకోదలచుకోలేదు. అయితే కోహ్లీ కడుపులో తప్పకుండా మంట ఉండే ఉంటుంది. అది మాత్రం పక్కా’’ అని చెప్పుకొచ్చాడు. కారణమేదైనా ఆ విషయంలో తనకు పూర్తి స్పష్టత లేదని వాట్సన్ తేల్చి చెప్పాడు.
Ice Cream Crime: ఐస్‘క్రైమ్’ స్టోరీ.. బాలుడు మృతి.. కేసులో షాకింగ్ నిజాలు
కాగా.. ఈనెల 15వ తేదీన జరిగిన మ్యాచ్‌లో డీసీపై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందిన ఈ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ పలుసార్లు గుంగూలీవైపు గుర్రుగా చూశాడు. అలాగే.. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో కోహ్లీ-గంగూలీ తారసపడ్డారు. కానీ.. షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. రికీపాంటింగ్‌తో కోహ్లీ మాట్లాడుతుండగా.. గంగూలీ కూడా కోహ్లీని పట్టించుకోకుండా ముందుకెళ్లాడు. ఆ తర్వాత కోహ్లీ-గంగూలీ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం జరిగింది.