టోక్యో చేరుకున్న ఒలింపిక్ అథ్లెట్‌కు కరోనా పాజిటివ్…

టోక్యోకు చేరుకున్న సెర్బియా బృందంలోని ఓ అథ్లెట్ కరోనా బారిన పడ్డాడు. టోక్యోలోని హనెడా విమానాశ్రయంకు చేరుకున్న సెర్బియా టీం ఆటగాళ్లకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఒకరికి కరోనా సోకింది. ఈ బృందం నాంటో నగరంలో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందాల్సి ఉండగా, పాజిటివ్‌గా తేలిన అథ్లెట్‌ను ఐసోలేషన్‌కు పంపారు. మిగతా వారిని ఎయిర్‌పోర్టు సమీపంలోని ప్రత్యేక కేంద్రానికి తరలించారు. గత నెలలో జపాన్ చేరుకున్న ఉగాండా జట్టులోని ఇద్దరు ఆటగాళ్ళు కూడా కరోనా బారినపడ్డారు. దీంతో విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశారు అధికారులు.