రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు చాహల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కనీలో వేలాడదీశాడని తెలిపాడు. ఏ తప్పిదం జరిగినా తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని సంచలన విషయాన్ని బయటపెట్టాడు. అయితే ఆ ప్లేయర్ పేరును చాహల్ వెల్లడించలేదు. తాజాగా చాహల్ వ్యాఖ్యలపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు.
చాహల్ సదరు ఆటగాడి పేరు చెప్పాలని, అది సరదాగా చేసిన పని కాదని, సదరు ఆటగాడిపై తీసుకున్న చర్యలు ఏంటనే విషయం తెలియాలని సోషల్ మీడియా వేదికగా సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. తాగిన మైకంలో చాహల్‌ను బాల్కనీలో వేలాడదీసిన ఆటగాడి పేరు వెల్లడించాల్సిన అవసరం ఉందన్నాడు. చాహల్ చెప్పింది నిజమైతే అది ఏ మాత్రం సరదాగా చేసిన పని కాదన్నాడు. అసలేం జరిగిందనే విషయం తెలవడం చాలా ముఖ్యమని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.
మరోవైపు రవిశాస్త్రి కూడా చాహల్ వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించాడు. ఇదేం నవ్వులాట కాదని, చాలా తీవ్రమైన విషయమని, ఆందోళన కలిగించేదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. తాగిన మత్తులో ఆ ఆటగాడు ఇంతటి పనికి పాల్పడి ఉంటే అది చాలా ఆందోళన కలిగించే విషయమేనని రవిశాస్త్రి ఆవేదన వ్యక్తం చేశాడు.
https://ntvtelugu.com/ipl-2022-tv-ratings-33-percent-down-in-first-week/
