Site icon NTV Telugu

BWF Championship: చరిత్ర సృష్టించిన చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్

Badminton World Championship

Badminton World Championship

BWF Championship 2022: జపాన్‌లోని టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఛాంపియన్ షిప్-2022లో పురుషుల డబుల్ క్వార్టర్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ జోడీ అదరగొట్టింది. క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన యుగో కొబయాషి, టకురో హోకిని 24-22, 15-21, 21-14 తేడాతో చిరాగ్ శెట్టి-సాత్విక్ జోడీ ఓడించింది. జపాన్ వరల్డ్ నంబర్ 2 జోడీపై వీరిద్దరూ గెలుపొందడంతో భారత్‌కు పతకం ఖాయం చేశారు. ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న ఈ జంట ఇప్పుడు బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పతకం సాధించనున్నారు.

Read Also: International Dogs Day: ప్రతి కుక్కకు ఓ రోజు.. ఆ రోజు ఈ రోజే..!!

అయితే ఈ మ్యాచ్‌లో భారత జోడీకి విజయం సాధారణంగా ఏమీ రాలేదు. ఇరు వైపులా విజయం దోబూచులాడింది. తొలి సెట్ 22-22గా ఉన్నప్పుడు చిరాగ్ మిడ్‌కోర్ట్ నుంచి క్రాస్ ఆడి పాయింట్ సాధించడంతో గేమ్‌ భారత్ వశమైంది. అయితే రెండో గేమ్‌లో భారత జోడీ వెనుకంజ వేయడంతో ఉత్కంఠ నెలకొంది. స్కోర్‌కార్డు 11-9 రీడింగ్‌తో ఉన్నప్పుడు ఇంకా పుంజుకునే అవకాశాలున్నా.. జపాన్ జోడీ ఎటాకింగ్ గేమ్ ఆడి గెలుపొందింది. దీంతో మ్యాచ్ 1-1తో సమమైంది. భారత్ మూడో గేమ్‌ మ్యాచ్ డిసైడర్ అయింది. మూడో గేమ్‌లో భీకరంగా పుంజుకున్న సాత్విక్, చిరాగ్ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. దీంతో ఈ గేమ్ గెలుపొందిన భారత జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో వరల్డ్ ఛాంపియన్ షిప్‌ చరిత్రలో భారతదేశానికి ఇదే తొలి పతకం కానుంది. తద్వారా పతకం సాధించిన తొలి జోడీగా చిరాగ్ శెట్టి-సాత్విక్ సాయిరాజ్ జోడీ చరిత్ర సృష్టించింది.

Exit mobile version