Sanju Samson: ఇన్‌స్పిరేషన్ నుంచి ఫేవరెట్ మూవీ వరకు.. సంజు రాపిడ్ ఫైర్ సమాధానాలు ఇవే!
- టీమిండియా హీరో సంజు శాంసన్
- వరుసగా మూడు కీలక మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు
- ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా సంజు శాంసన్
- సంజు రాపిడ్ ఫైర్ సమాధానాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson Rapid Fire: భారత క్రికెటర్ సంజు శాంసన్ ఇప్పుడు టీమిండియా హీరో. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో సంజు కీలక పాత్ర పోషించాడు. వరుసగా మూడు కీలక మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు బాది.. తానెంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ప్రపంచ కప్‌లో ఆడిన 5 మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. తాజాగా ఇండియా టుడే కంక్లేవ్‌కు సంజు హాజరయ్యాడు. రాపిడ్ ఫైర్ సెషన్‌లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి తనకు ప్రేరణ ఇచ్చిన ఆటగాడు ఎవరు? మొదటి ఐపీఎల్ సిక్స్ ఎప్పుడు కొట్టాడు? వంటి ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇచ్చాడు.
చిన్నప్పటి ప్రేరణ:
చిన్నప్పటి నుంచి తనకు ప్రేరణగా నిలిచిన క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నకు సంజు శాంసన్ స్పందిస్తూ.. సచిన్ టెండూల్కర్ పేరు చెప్పాడు. సచిన్ లాంటి దిగ్గజ ఆటగాడి ఆటను చూస్తూ తాను క్రికెట్‌లోకి వచ్చానని తెలిపాడు.
Also Read
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
మొదటి ఐపీఎల్ సిక్స్:
తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి సిక్స్‌ను అప్పటి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై కొట్టానని సంజు శాంసన్ గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభ దశలో వచ్చిన ఆ సిక్స్ తనకు ప్రత్యేకమైన అనుభూతి ఇచ్చిందని చెప్పాడు.
మొదటి వీడియో గేమ్, మొబైల్:
తాను మొదట ఆడిన వీడియో గేమ్‌గా “GTA Vice City”ను సంజు శాంసన్ పేర్కొన్నాడు. అలాగే తన మొదటి మొబైల్ ఫోన్‌గా మోటరోలా కంపెనీ ఫోన్‌ను ఉపయోగించానని చెప్పాడు.
ఫేవరెట్ సినిమా:
సినిమాల విషయానికి వస్తే.. తాను సూపర్ స్టార్ రజినీకాంత నటించిన సినిమాలను అన్ని ఇష్టపడతానని సంజు తెలిపాడు. రజనీకాంత్ సినిమాలు తనకు ఎంతో వినోదాన్ని ఇస్తాయని చెప్పాడు.
మొదటి స్టేడియం అనుభవం:
స్టేడియంకు తాను మొదటిసారి వెళ్లింది ఐపీఎల్ మ్యాచ్ కోసమేనని సంజు శాంసన్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో ఆడే వరకు తాను ఎప్పుడూ స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూడలేదని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ రాపిడ్ ఫైర్ సమాధానాలు సంజు వ్యక్తిగత జీవితంలోని విషయాలను అభిమానులకు తెలియజేశాయి.
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్‌లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!