Sanju Samson Watched Rajinikanth’s Jailer 2: ‘సూపర్‌స్టార్’ రజనీకాంత్‌కు టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. రజినిపై తనకున్న అభిమానాన్ని సంజు మరోసారి చాటుకున్నాడు. ‘జైలర్ 2’ను సినిమాను చూసేందుకు ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. ఈ విషయాన్ని సంజునే స్వయంగా తెలిపాడు. థియేటర్ వద్ద సంజు చేసిన సందడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన అభిమాన నటుడి సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసిన తెగ సంబరపడిపోయాడు.
రజనీకాంత్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని సంజు శాంసన్ గతంలోనూ పలుమార్లు చెప్పాడు. ఆయన కొత్త సినిమా విడుదలైనప్పుడల్లా వీలైనంత త్వరగా చూడాలని అనుకుంటానని తెలిపాడు. అయితే ఢిల్లీలో ఓ కార్యక్రమం ఉండటంతో జైలర్ 2 విడుదలైన రోజున సినిమాను చూడలేకపోయానని వెల్లడించాడు. దీంతో మరుసటి రోజు ప్రత్యేకంగా సినిమా చూసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. జైలర్ 2 సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన సందర్భంగా సంజు తన ఆనందాన్ని పంచుకున్నాడు. ‘రజనీ సర్ సినిమాలు చూడటం నాకు చాలా ఇష్టం. ఆయన తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటాను. జైలర్ 2 విడుదలైన రోజున చూడలేకపోయాను. నిన్న ఢిల్లీలో ఓ కార్యక్రమం ఉండటంతో కుదరలేదు. అందుకే ఒక రోజు ఆలస్యంగా సినిమా చూడబోతున్నాను’ అని చెప్పాడు.
‘ఈసారి సినిమా చూసేందుకు మొత్తం థియేటర్‌ను బుక్ చేసుకునే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. నా భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సినిమా చూసే అవకాశం వచ్చింది. టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌లో తమిళం తెలిసిన వారందరూ వస్తున్నారు. రజనీకాంత్‌ను పెద్ద తెరపై చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా’ అని సంజు శాంసన్ చెప్పుకొచ్చాడు. రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగా భారీ అభిమానగణం ఉంది. ఆయన ప్రత్యేకమైన స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రజిని సినిమాల విడుదలను అభిమానులు ఓ వేడుకలా జరుపుకుంటారు. అలాంటి సూపర్‌స్టార్‌పై తనకున్న అభిమానాన్ని సంజు ఈ ప్రత్యేక ప్రదర్శనతో మరోసారి చాటుకున్నాడు.

