Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీస్‌లో సానియా-బోపన్న జోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ ఫైనల్లో ప్రవేశించింది. ఈ టోర్నీలో మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి బరిలోకి దిగిన ఆమె సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సానియా జోడీకి వాకోవర్ లభించడంతో ఈ అవకాశం లభించింది. లాత్వియా, స్పెయిన్‌కు చెందిన జెలెనా ఒస్టాపెంకో-డేవిడ్ వెగా జోడీతో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ జోడీ క్వార్టర్స్ నుంచి తప్పుకోవడంతో సానియా, బోపన్న సెమీస్ చేరారు. అంతకు ముందు ఉరుగ్వే, జపాన్ జోడీ ఏరియల్ బెహార్-మకాటో నినోమియాపై 6-4, 7-6 తేడాతో గెలిచి క్వార్టర్స్ చేరింది సానియా, బోపన్న జంట.
తాజాగా, క్వార్టర్స్ ఆడకుండానే సెమీస్ ఛాన్స్ దక్కడంతో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో సానియా నిలిచింది. కాగా, విమెన్స్ డబుల్స్ బరిలోనూ దిగిన సానియాకు రెండో రౌండ్లోనే నిరాశ ఎదురైంది. కజకిస్థాన్‌కు చెందిన ఏనా డానిలినాతో కలిసి డబుల్స్ బరిలో దిగిన సానియా.. రెండో రౌండ్లో బెల్జియం, ఉక్రెయిన్ జోడీ అలీసన్ వాన్ ఉయ్‌ట్వాంక్-అనెలినా కలినినా జోడీ చేతిలో పరాజయం పాలైంది. సానియా గతేడాది యూఎస్ ఓపెన్ తర్వాతే రిటైర్ అవుతున్నట్లు మొదట అనౌన్స్ చేసింది. అయితే గాయం కారణంగా ఆ టోర్నీలో ఆడలేకపోయింది. ఈ గాయంతో మూడు నెలల పాటు టెన్నిస్‌కు దూరమై ఈ మధ్యే తిరిగి రాకెట్ పట్టిది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేసి ఆటకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది.
Also Read
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
తాజావార్తలు
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
-
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
-
Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
-
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
-
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?