NTV Telugu Site icon

U19 World Cup: సచిన్ చేతుల మీదుగా అండర్-19 విమెన్స్ టీమ్‌కు సత్కారం

97456274

97456274

మొదటిసారి నిర్వహించిన అండర్-19 మహిళల ప్రపంచకప్ విజేతగా నిలచిన టీమిండియా జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆటగాళ్లకు నజరానాలూ ప్రకటిస్తున్నారు.ఇప్పటికే జట్టులోని సభ్యులు, రూ. 5 కోట్లను నజరానాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలో భారత క్రీడాకారిణులను ప్రత్యేకంగా సత్కరించేందుకు బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది.

భారత్‌ – న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్‌ బుధవారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. మ్యాచ్‌కు ముందు అండర్-19 మహిళల ప్రపంచకప్‌ విజేతలను సత్కరిస్తామని బీసీసీఐ వెల్లడించింది. నేడు దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి భారత మహిళల అండర్ -19 జట్టు చేరుకొంటుంది. “అండర్ -19 మహిళల ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ జట్టు సభ్యులకు సచిన్‌ టెండూల్కర్, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్స్‌ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించబోతున్నందుకు సంతోషంగా ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 1 సాయంత్రం 6.30 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది” అని బీసీసీఐ కార్యదర్శి జైషా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Union Budget 2023: రాబోయే పాతికేళ్లు ఎంతో కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఇటీవల జరిగిన అండర్ 19 వుమెన్స్ వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు విశ్వవిజేతగా మారిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్‌తో జరిగిన ఫైనల్‌లో సులభంగా గెలిచిన భారత అమ్మాయిలు.. ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో వీరిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. సోమవారం నాడు టీమిండియా మహిళా జట్టు ముంబయికి చేరుకుంది. అక్కడ నుంచి సరాసరి సన్మాన కార్యక్రమం కోసం అహ్మదాబాద్ బయల్దేరింది. బుధవారం నాడు ఈ కార్యక్రమం జరగనుంది.

షెఫాలీ వర్మ కెప్టెన్సీలో భారత అండర్ 19 జట్టు విశ్వవిజేతగా నిలిచింది. భారత మహిళల క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ ఫైనల్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 17.1 ఓవర్లో కేవలం 68 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు టైటాస్ సధు, అర్చనా దేవి, ప్రశవి చోప్రా ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. అనంతరం లక్ష్య ఛేదనంలో భారత అమ్మాయిలు 3 వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. సౌమ్యా తివారీ(24), గొంగడి త్రిష(24) ఆకట్టుకునే ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించారు.

Threat Call : సీఎంను చంపేస్తాం.. ఢిల్లీనుంచి బెదిరింపు కాల్