Site icon NTV Telugu

క్రిస్మస్ తాతయ్య గెటప్‌లో సచిన్.. ఆకట్టుకుంటున్న ఫోటో

sachin tendulkar

క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రీడాకారులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో భారత దిగ్గజ ఆటగాడు సచిన్ కూడా సోషల్ మీడియా వేదికగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాకుండా వేర్వేరు సంవత్సరాల్లో తాను క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న ఫోటోలను కూడా సచిన్ షేర్ చేశాడు. ఇందులోని ఓ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్య గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో సచిన్ క్రిస్మస్ తాతయ్యగా ఓ బాలికతో సందడి చేస్తున్నట్లు ఉంది. ఈ ఫోటో 2018లో తీసినట్లు సచిన్ తెలిపాడు.

సచిన్ షేర్ చేసిన మరో ఫోటో 2019లో తీసింది. ఈ ఫోటోలో క్రిస్మస్ తాతయ్య పక్కనే సచిన్ నిలబడి ఉన్నాడు. వేర్వేరు సంవత్సరాలలో తీసుకున్న ఫోటోలు క్రిస్మస్ అనుభూతిని కలిగిస్తున్నాయని.. వాటిని చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపాడు. మరోవైపు హైదరాబాదీ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా క్రిస్మస్ విషెస్ తెలియజేశాడు. ఆనందం ఒక బ‌హుమ‌తి, శాంతి ఒక బ‌హుమ‌తి, శ్రేయ‌స్సు ఒక బ‌హుమ‌తి. ఇవ‌న్నీ క్రిస్మస్ రోజు పొంద‌గ‌లం అంటూ వీవీఎస్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Exit mobile version