NTV Telugu Site icon

SaraTendulkar: అటు అర్జున్.. ఇటు గిల్.. ట్రెండింగ్ లో సారా టెండూల్కర్

Sara Tendulkar

Sara Tendulkar

ఐపీఎల్ 16వ సీజన్ లో మంగళవారం ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నంత సేపు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లిస్ట్ లో నిలిచింది. ఇలా ఎందుకున్నది అనేది ఈ పాటికే మీకు అర్థ మయి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మన్ గిల్, సారా టెండూల్కర్ ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ గిల్ టీమిండియాలో పర్మినెంట్ స్థానం సంపాదించినప్పటి నుంచి సారా, గిల్ ల మధ్య ఏదో ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే తాము మంచి స్నేహితులమని గిల్ పేర్కొన్నాడు.. కానీ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తమకు నచ్చింది ఊహించుకుంటున్నారు.

Also Read : Yogi Death Threat: ప్రియురాలి తండ్రి ఫోన్‌తో కుట్ర.. యోగిని చంపేస్తానన్న వ్యక్తి అరెస్ట్

ఇక మరో విషయం ఏమిటంటే.. ముంబై ఇండియన్స్ తరపున సారా టెండూల్కర్ సోదరుడు అర్జున్ టెండూల్కర్ మ్యాచ్ లో బరిలో ఉండడమే. మరో వైపు గుజరాత్ టైటాన్స్ తరపున శుబ్ మన్ గిల్.. ముంబై జట్టు తరపున అర్జున్ ప్రత్యర్థులుగా తలపడుతుండడంతో సారా ఎవరికి మద్దతివ్వాలో తెలియక మ్యా్చ్ చూడడం మానేసిందని కొందరు నెటిజన్లు ట్విట్టర్ లో ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ లో అటు అర్జున్ టెండూల్కర్.. ఇటు శుబ్ మన్ గిల్ లు ఒక్కసారి మాత్రమే ఎదురుపడ్డారు. గుజరాత్ టైటాన్స్ తొలి ఓవర్ వేసినప్పటికి ఆ ఓవర్ లో నాలుగో బంతిని గిల్ ఎదుర్కొని ఒక పరుగుల తీశాడు. ఇక తన రెండో ఓవర్ తొలి బంతికే వృద్దిమాన్ సాహాను ఔట్ చేయడంతో అర్జున్ బౌలింగ్ లో ఆడే అవకాశం శుబ్ మన్ గిల్ కు రాలేదు.

Also Read : Prakash Singh Badal: పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత

అయితే ఈ మ్యాచ్ లో అర్జున్ టెండూల్కర్ రెండు ఓవర్లు మాత్రమే వేసి 9 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ తీసుకున్నాడు. మరో వైపు గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ మాత్రం సీజన్ లో మూడో అర్థ సెంచరీ సాధించి తన ఫామ్ ను కంటిన్యూ చేశాడు. ఏదీ ఏమైనా గుజరాత్ టైటాన్స్-ముంబై మ్యాచ్ లో అటు సోదరుడు అర్జున్ టెండూల్కర్.. ఇటు శుబ్ మన్ గిల్ ఇద్దరు మంచి ప్రదర్శన కనబరచడంతో సారా టెండూల్కర్ కు ఎలాంటి బాధ లేదని.. పైగా ఈ ఇద్దరు ఎదురుపడిన ఎవరు పైచేయి సాధించకపోవడం సారాకు సంతోషం కలిగించి ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ పేర్కొన్నారు.

Show comments