Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Sa Vs Nz Semi Final 2026 Head To Head Predicted Playing Xi And Pitch Report

SA vs NZ Semi-Final 2026: న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11, పిచ్‌ రిపోర్ట్ ఇదే!

Published Date :March 4, 2026 , 8:13 am
By Sampath Kumar
  • టీ20 ప్రపంచ కప్‌ 2026లో నేడు తొలి సెమీ ఫైనల్
  • న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయి
  • హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11, పిచ్‌ రిపోర్ట్ ఇదే
SA vs NZ Semi-Final 2026: న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11, పిచ్‌ రిపోర్ట్ ఇదే!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

SA vs NZ Semi-Final 2026 Head-to-Head: టీ20 ప్రపంచ కప్‌ 2026లో రసవత్తర సమరానికి వేళైంది. తొలి సెమీ ఫైనల్లో నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. మెగా టోర్నీలో అపజయమే లేని దక్షిణాఫ్రికా.. అద్భుత ఆటతో సెమీస్ చేరింది. మరోవైపు కివీస్‌ కష్టంగానే ముందంజ వేసింది. సఫారీ టీమ్ దుర్భేద్యంగా కనిపిస్తున్నన్నా.. న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. రెండు జట్లూ తొలి టీ20 ప్రపంచ కప్‌ ట్రోఫీ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఆసక్తి రేపుతోంది. తొలి సెమీ ఫైనల్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ టీమ్స్ హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11, పిచ్‌ రిపోర్ట్ ఓసారి చూద్దాం.

అద్భుతమైన ఫామ్‌లో దక్షిణాఫ్రికా:
టీ20 ప్రపంచ కప్‌ 2026లో దక్షిణాఫ్రికా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గ్రూపు, సూపర్‌ 8లో ఓడిపోలేదు. అద్భుత బ్యాటింగ్‌ లైనప్‌ సఫారీ జట్టుకు ఉంది. టాప్‌ ఆర్డర్‌ భారీగా రన్స్ చేస్తోంది. ముఖ్యంగా కెప్టెన్‌ ఐడెన్ మార్‌క్రమ్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. మూడు అర్ధసెంచరీలతో 268 పరుగులు చేశాడు. రికెల్టన్‌ 228 పరుగులు చేశాడు. డికాక్ కూడా పర్వాలేదనిపిస్తునాడు. బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్‌, యాన్సెన్‌లతో మిడిల్‌ ఆర్డర్‌ బలంగా ఉంది. రబాడ, ఎంగిడి, బోష్, యాన్సెన్, మహరాజ్‌లతో బౌలింగ్‌ బాగుంది.

Also Read

  • Daniel Vettori: "పక్కా ప్లాన్‌తో దిగుతున్నాం".. పంజాబ్ జోరుకు బ్రేక్ వేసేందుకు SRH కోచ్ మాస్టార్ ప్లాన్!
  • Axar Patel: కెప్టెన్ అక్షర్ పటెల్ బిగ్ మిస్టెక్స్.. ఏకంగా 2 పాయింట్స్ కోల్పోయిన ఢిల్లీ!
  • IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
  • Sanju Samson: 'చెట్టా' కాదు.. 'సంజూ' అని పిలవండి! ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వేళ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Add as a preferred
source on google

కివీస్ పుంజుకోవాల్సిందే:
సూపర్‌ 8లో న్యూజిలాండ్‌ ఇతర ఫలితాలపై ఆధారపడాల్సివచ్చింది. కివీస్‌కు కూడా మంచి లైనప్ ఉంది. ఓపెనర్‌ సీఫెర్ట్‌ 216 పరుగులు చేశాడు. ఫైన్ అలెన్‌ భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉన్నాడు. ఫిలిప్స్, రచిన్‌, మిచెల్ బ్యాట్‌ ఝళిపించడం కివీస్‌కు చాలా అవసరం. కెప్టెన్‌ శాంట్నర్‌ బ్యాటుతోనూ మంచి ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. స్పిన్నర్లు శాంట్నర్‌, రచిన్, ఫిలిప్స్‌ సమష్టిగా రాణిస్తున్నారు. ఫాస్ట్‌బౌలర్‌ ఫెర్గూసన్‌ బౌలింగ్‌ న్యూజిలాండ్‌కు చాలా కీలకం. నీషమ్, డఫీలు ఎలా ఆడుతారో చూడాలి.

పిచ్‌ రిపోర్ట్:
ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. నేడు భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. సెమీఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే.. సూపర్‌ 8లో మెరుగైన టీమ్ ఫైనల్ చేరుతుంది. సూపర్‌-8లో దక్షిణాఫ్రికా ఆరు పాయింట్స్ సాధించగా.. కివీస్‌కు 3 పాయింట్లే ఉన్నాయి.

దక్షిణాఫ్రికాదే పైచేయి:
టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడ్డ ఐదు మ్యాచ్‌లలో తలపడ్డాయి. అన్ని మ్యాచ్‌ల్లో సఫారీలే గెలిచారు. టీ20 మ్యాచ్‌లలో మొత్తం 19 సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 12, న్యూజిలాండ్‌ 7 గెలిచింది. ఎలా చూసినా న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది.

తుది జట్లు (అంచనా):
దక్షిణాఫ్రికా: డికాక్, రికెల్టన్, మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బోష్, కేశవ్‌ మహరాజ్, రబాడ, ఎంగిడి.
న్యూజిలాండ్‌: అలెన్, సీఫర్ట్, రచిన్‌ రవీంద్ర, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, శాంట్నర్‌ (కెప్టెన్‌), నీషమ్, డఫీ, ఫెర్గూసన్, ఇష్‌ సోధి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • SA vs NZ
  • SA vs NZ Semi Final 2026
  • SA vs NZ Semi Final 2026 Head-to-Head
  • SA vs NZ Semi Final 2026 Playing 11
  • South Africa vs New Zealand

తాజావార్తలు

  • TVK Vijay: విజయ్‌కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన

  • Bhagyashri Borse: భాగ్యశ్రీ భోర్సే బర్త్ డే.. ‘లెనిన్’ డిఫరెంట్ పోస్టర్ విడుదల

  • Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!

  • Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!

  • DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions