Ruturaj Gaikwad: సెంచరీ వెనుక సీక్రెట్ ఇదే.. రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం
- సెంచరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్
- సెంచరీ వెనుక సీక్రెట్ ఏంటో చెప్పిన రుతురాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రై నేషన్ ఏ సిరీస్ 2026లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. సెంచరీతో భారత్-ఏ జట్టుకు విజయం అందించిన రుతురాజ్ గైక్వాడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 114 బంతుల్లో 101 పరుగులు చేసి భారత్-ఏ జట్టుకు భారీ స్కోరు అందించాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎలాంటి గణాంకాలు తెలియవని, అయితే సెంచరీ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమేనని రుతురాజ్ చెప్పాడు.
‘మీరు చెప్పిన గణాంకాల గురించి నాకు తెలియదు. కానీ సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. ఇక్కడి పరిస్థితులు మేము స్వదేశంలో ఆడే పిచ్‌లతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. గాలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. అందుకే క్రీజులో సెట్ అయిన బ్యాటర్ చివరి వరకు ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజు ఆ బాధ్యతను నేను తీసుకున్నా. చాలా సంతోషంగా ఉంది. వీలైనంత ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేయడానికే ప్రయత్నించాను. అప్పటికే మేము మూడు వికెట్లు కోల్పోయాం. అలాంటి సమయంలో కొత్త బ్యాటర్ వచ్చి మిడిల్ ఓవర్లలో ఇబ్బంది పడకూడదని భావించాం. అందుకే నేను, తిలక్ వర్మ కలిసి ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం’ అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
Also Read
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
నాలుగో వికెట్‌కు కెప్టెన్ తిలక్ వర్మతో కలిసి 150 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన విషయాన్ని గుర్తుచేసుకున్న రుతురాజ్.. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించగలమనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నాడు. ‘మేము ఎంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తే అంత మంచిదని భావించాం. డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం మాకు ఉందని తెలుసు. కానీ శ్రీలంక బౌలర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. వారు చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఒక దశలో మేము 290 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేస్తామని అనుకున్నాం. కానీ శ్రీలంక బౌలర్లు మమ్మల్ని అడ్డుకున్నారు. వారు చాలా బాగా బౌలింగ్ చేశారు’ అని అన్నాడు.
ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులతో మెరిసి భారత్-ఏ జట్టు 277 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం భారత బౌలర్లు సమిష్టిగా రాణించి శ్రీలంక-ఏను 269 పరుగులకు ఆలౌట్ చేయడంతో.. భారత్-ఏ 8 పరుగుల తేడాతో త్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
తాజావార్తలు
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!