RR Captain 2026: రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యాజమాన్యం.. కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్, నిజమేనా?
- రాజస్థాన్ రాయల్స్ జట్టులో యాజమాన్య మార్పు
- జట్టులో కీలక మార్పులు ఉంటాయన్న ఊహాగానాలు
- కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్, నిజమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riyan Parag Confirmed RR Captain in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టులో యాజమాన్య మార్పు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం ఈ ఫ్రాంచైజీని సుమారు 1.63 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. ఈ భారీ డీల్‌తో రాజస్థాన్ ప్రాంచైజీ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే యాజమాన్యం మారిన వెంటనే జట్టులో కీలక మార్పులు ఉంటాయన్న ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ విషయంలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ప్రస్తుత కెప్టెన్ రియాన్ పరాగ్ స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను కెప్టెన్‌గా నియమించాలని కొత్త యాజమాన్యం బావిస్తోందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ రూమర్స్ క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని తాజాగా స్పష్టమైంది. యాజమాన్యం లేదా కల్ సోమాని ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
- Sunrisers: బోణి కొట్టిన సన్ రైజర్స్.. ఎమ్ఐ లండన్‌పై ఘన విజయం..
ఇప్పటికే ఐపీఎల్ 2026 సీజన్ కోసం రియాన్ పరాగ్‌ను అధికారిక కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది. జట్టు యాజమాన్యం కూడా తన నిర్ణయంపై నిలబడుతూ.. పరాగ్ నాయకత్వంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తోంది. కొత్త యాజమాన్యం వచ్చినప్పటికీ జట్టు, కెప్టెన్సీ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టమవుతోంది. రియాన్ పరాగ్ నేతృత్వంలోనే రాజస్థాన్ ఈ సీజన్‌లో బరిలోకి దిగనుంది. అభిమానులు కూడా ఐపీఎల్ 2026 ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!