Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్‌ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!
- సోషల్ మీడియాలో రోహిత్ శర్మకు సంబంధించిన వీడియో
- రోహిత్ వాచ్‌ను దొంగిలించాలని చూసిన అభిమాని
- వెనక్కి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చిన హిట్‌మ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కారులో కూర్చున్న రోహిత్ వద్దకు వచ్చిన ఇద్దరు అభిమానులు.. అతడి చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌ను లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న విషయంపై అధికారిక సమాచారం లేదు. ఐపీఎల్ 2026 సందర్భంగా జరిగుండొచ్చని తెలుస్తోంది.
రోహిత్ శర్మ తన రేంజ్ రోవర్ కారులో ఫ్యామిలీతో కలిసి వెళుతున్నాడు. వెనుక సీట్లో కూర్చున్న హిట్‌మ్యాన్.. బయట ఉన్న అభిమానులకు అభివాదం చేస్తున్నాడు. ముందుగా ఇది ఓ సాధారణ ఫ్యాన్ మూమెంట్‌లా అనిపించినా.. కొద్దిసేపటికే పరిస్థితి పూర్తిగా మారింది. ఇద్దరు యువకులు కారుకు చాలా దగ్గరగా వచ్చి.. రోహిత్ చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అందులో ఒకరు హిట్‌మ్యాన్ చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌ను తీసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన రోహిత్.. కార్ విండోను పైకి ఎత్తి, వెనక్కి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చాడు.
Also Read
- Rohit Sharma TV Show: రెండు లైన్లకే ఇంత వైరల్ అయితే.. మొత్తం షో రిలీజ్ అయితే ఇంకెంత రచ్చ అవుతుందో!
- Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!
- Kedar Jadhav: సచిన్‌తో పోలికలా? 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీపై కేదార్ జాదవ్ సంచలన వ్యాఖ్యలు!
- KL Rahul IPL Record: ఐపీఎల్‌లో కోహ్లీకే సాధ్యం కాని ఘనత.. చరిత్ర సృష్టించిన రాహుల్!
ఈ ఘటన తర్వాత రోహిత్ శర్మ వాచ్ ఖరీదు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. హిట్‌మ్యాన్ పెట్టుకున్న వాచ్ ప్రముఖ లగ్జరీ బ్రాండ్ రోలెక్స్‌కు చెందిన జిరాఫీ మోడల్ అని నెటిజన్లు అంటున్నారు. దీని విలువ సుమారు రూ.3.25 కోట్లు ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని రోహిత్ లేదా అతడి టీమ్ అధికారికంగా ధృవీకరించలేదు. ఏదేమైనా వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2026లో రోహిత్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇటీవల లక్నోపై 44 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టుకు కీలక విజయం అందించాడు. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ కేవలం ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే ముంబైకి ఈ సీజన్ అంతగా కలిసి రావడం లేదు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో ఏడు పరాజయాలు ఎదుర్కొన్న ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
Rohit Sharma Fans tried to snatch his 3.25 Cr “Giraffe” watch from his wrist. And suddenly he close the mirror. pic.twitter.com/vMIQFxcdxt
— Aman (@Proteinkohli) May 8, 2026
తాజావార్తలు
-
Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్‌ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!
-
Wedding Drama: వరమాల వేసే టైమ్‌లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్‌చేస్తే..
-
Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
-
Peddi: రామ్ చరణ్ కోసం రంగంలోకి టీమ్ ఇండియా లెజెండ్..
-
PM Modi: “సిలిగురి సింహం”.. ప్రధాని మోడీ స్వయంగా కాళ్లు మొక్కిన ఆ ‘పెద్దాయన’ ఎవరో తెలుసా?