Rohit Sharma: రోహిత్ శర్మ.. ప్రస్తుతం టీం ఇండియాను విజయపథంలో నడిపిస్తున్న సారథి. కెప్టెన్‌గా వరల్డ్ కప్ టోర్నీలో తన సత్తా చాటుతున్నారు. ఇటు ఓపెనర్‌గా బౌలర్లను ఊచకోత కోస్తూ.. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా చేస్తున్నాడు. మరోక్క విజయం సాధిస్తే, వరల్డ్ కప్ అందుకున్న మూడో భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కుతారు. రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో లక్ష మంది ఫ్యాన్స్, భారత ప్రధాని నరేంద్రమోడీతో పాటు హై లెవల్ పీపుల్ మధ్య ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హై టెన్షన్ ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది.
ఇదిలా ఉంటే రోహిత్ శర్మ చిన్నతనం మాత్రం అనుకున్నంత సాఫీగా ఏం సాగలేదు. ఒక సమయంలో స్కూల్ ఫీజు రూ.275 చెల్లించే పరిస్థితి కూడా లేదు. 1999లో అతని జీవితాన్ని మార్చిన సంఘటనను రోహిత్ శర్మ కోచ్ దినేష్ లాడ్ వివరించారు. రోహిత్ శర్మ తన పాఠశాల రోజుల్లో ఆఫ్ స్పిన్నర్‌గా ఒక టోర్నమెంట్‌లో మంచి ప్రదర్శన కనబరచడం ముంబై క్రికెటర్ సిద్దేష్ లాడ్ తండ్రైన కోచ్ దినేష్ లాడ్ దృష్టిలో పడింది. అక్కడి నుంచి రోహిత్ దశ తిరిగింది.
Read Also: World Cup Final 2023: ఫైనల్ పోరులో కీలక మార్పులు.. ఆ ఆటగాడికి ఛాన్స్..!
రోహిత్ శర్మ ఆటతీరు దినేష్ లాడ్‌ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ విషయంపై అతని తల్లిదండ్రులతో చర్చించాలని అనుకున్నారు. రోహిత్ ముంబైలోని బోరివలి ప్రాంతంలో తన మామ, తాతలతో కలిసి ఉండేవాడు. దినేష్ లాడ్ ఒకరోజు రోహిత్ మామను కలిసి, స్వామి వివేకానంద స్కూల్‌లో చేర్పించాలని పట్టుబట్టాడు.
అయితే రోహిత్ చదువుతున్న స్కూల్‌లో కేవలం రూ. 30 మాత్రమే వసూలు చేసేవారు, కానీ రూ. 275 స్కూల్ ఫీజ్ చెల్లించే స్థోమత లేదని అతని మామ కోచ్‌కి చెప్పారు. ‘‘ఈ విషయంపై కోచ్ రోహిత్ శర్మీకు ఫ్రీషిప్( ఆర్థికంగా వెనబడిన విద్యార్థులకు అందించే ఆర్థికసాయం) ఇవ్వాలని స్వామి వివేకానంద స్కూల్ డైరెక్టర్‌ని కోరాను. ఆ విద్యార్థిని ఎందుకు సపోర్టు చేస్తున్నామని డైరెక్టర్ అడిగితే, అతను మంచి క్రికెటర్ అవుతాడు, నేను అతడిని విడిచిపెట్టదలుచుకోలేదు’’ అని కోచ్ దినేష్ లాడ్ చెప్పారు.
ఇదే రోహిత్ శర్మ జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. దినేష్ లాడ్ కోచింగ్ లో రాటుదేలిన రోహిత్ U-19, భారత జట్టులో చోటు సంపాదించుకుని, అంచెలంచెలుగా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. సచిన్, యువరాజ్ సింగ్, సెహ్వాగ్ వంటి స్టార్ ప్లేయర్ల రిటైర్ తర్వాత జట్టులో కీలక ఆటగాడిగా పరుగుల వరద పారించాడు.