రోహిత్ శర్మ..ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించి కెప్టెన్‌గా తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు నేషనల్ టీమ్ బాధ్యతల్ని భుజానికెత్తుకుని ఇక్కడా అదే దూకుడు చూపిస్తున్నాడు. కెప్టెన్సీలో భారత్‌కు కొత్త పాఠాలు నేర్పిన ధోనీ రికార్డులతో పాటు అగ్రెసివ్ లీడర్‌షిప్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన కోహ్లీ రికార్డులను హిట్‌మ్యాన్ తిరగరాస్తున్నాడు. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రోహిత్..తన వైట్‌వాష్ రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. క్లీన్ స్వీప్ రికార్డుల్లో తనకు తిరుగే లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన కెప్టెన్సీ రేంజ్ ఏంటో ప్రపంచానికి మరోసారి చూపించాడు. కివీస్‌పై క్లీస్ స్వీప్‌తో ఏకంగా ఎనిమిది వైట్‌వాష్ విక్టరీలు అందుకుతున్న తొలి భారతీయ కెప్టెన్‌గా రోహిత్ నిలిచాడు. రోహిత్ స్థానంలో తర్వాత ఉన్న కోహ్లీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లలో ఐదు సిరీస్‌లు క్లీన్ స్వీప్ చేయగా.. కెప్టెన్ కూల్ ధోనీ నాలుగు సిరీస్ క్లీన్ స్వీప్‌ల్లో భాగమయ్యాడు.
Ants Can Detect Cancer: మూత్రం వాసన చూసి చీమలు క్యాన్సర్ ని గుర్తించగలవట..అధ్యయనంలో వెల్లడి
ఇక న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో దుమ్ములేపింది టీమిండియా. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్, గిల్ అదిరిపోయే శుభారంభం అందించారు. సెంచరీలతో కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించారు. రోహిత్ 85 బంతుల్లో 101 రన్స్ చేసి వన్డేల్లో 30వ సెంచరీ ఖాతాలో వేసుకోగా.. గిల్ 78 బంతుల్లో 112 రన్స్‌తో శతకం బాదాడు. అనంతరం కోహ్లీ (36)తో పాటు ఇషాన్ కిషన్ (17), సూర్యకుమార్ (14), సుందర్ (9) విఫలమవగా చివర్లో హార్దిక్ (54) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. శార్దూల్ (25) అతడికి సపోర్ట్ ఇచ్చాడు. దీంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 385/9 భారీ స్కోర్ చేసింది. అనంతరం బౌలింగ్‌లోనూ భారత బౌలర్లు రాణించడంతో కివీస్ 41.2 ఓవర్లలో 295 రన్స్‌కు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ కాన్వే (138) తప్ప మరెవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో శార్దూల్, కుల్దీప్ చెరో 3 వికెట్లతో సత్తాచాటగా.. చాహల్ 2, ఉమ్రాన్ 1, హార్దిక్ 1 వికెట్లు దక్కించుకున్నారు.