NTV Telugu Site icon

Rohit Sharma: కోహ్లీపై ప్రశ్న.. జర్నలిస్ట్‌పై మండిపడ్డ కెప్టెన్

Rohit Sharma Lost His Cool

Rohit Sharma Lost His Cool

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ నిరాశపరిచడంతో.. అతని ప్రదర్శనపై అప్పుడే చర్చలు, విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ జర్నలిస్ట్ మరోసారి కోహ్లీ ఆటతీరుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించాడు. ‘కోహ్లీ ప్రదర్శనపై చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి’ అని అనగానే రోహిత్ ఒక్కసారిగా కోపాద్రిక్తుడయ్యాడు. ‘ఎందుకు చర్చలు జరుగుతున్నాయ్ అయ్యా, నాకర్థం కావడం లేదు’ అంటూ బదులిచ్చాడు. ఆ తర్వాత శాంతించి.. కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు.

‘‘ఏ ఆటగాడు ఎప్పుడూ ఫామ్‌లో ఉండడు. కచ్ఛితంగా ఎత్తుపల్లాలు ఉంటాయి. నాకు తెలిసి, ప్రతి మ్యాచ్‌లోనూ భారీ స్కోరు చేసిన ఆటగాడిని ఎప్పుడూ చూడలేదు. అందరూ ఒక దశలో చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నవారే! ఫామ్‌ని కాకుండా ఓ ఆటగాడిలో క్వాలిటీని గమనించాలి. కోహ్లీ ఓ క్వాలిటీ ఆటగాడు. అతడు భారత జట్టుకి ఎన్నో సేవలు అందించాడు. ఎన్నోసార్లు జట్టుని గెలిపించాడు. అతనికి మంచి యావరేజ్ ఉంది. ఎన్నో పరుగులు సాధించాడు. ఇలాంటి ఆటగాళ్లకి ఒకట్రెండు ఇన్నింగ్స్ సమయం కావాల్సిందే’’ అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. కోహ్లీ తప్పకుండా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అంతేకాదు.. కోహ్లీ గురించి జరిగే చర్చల గురించి తమకీ తెలుసని, అయితే చాలా సంవత్సరాల నుంచి మేము అతడ్ని చూస్తూ వస్తున్నామని, అతని గురించి మాకేంటో స్పష్టంగా తెలుసని రోహిత్ అన్నాడు. ఈ విధంగా ఓ కెప్టెన్ తన ఆటగాడికి, ముఖ్యంగా కష్టాల్లో ఉన్న కోహ్లీకి మద్దతుగా ఉండటం చూసి.. క్రీడాభిమానులు రోహిత్‌ని కొనియాడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ప్రధాన బ్యాట్స్మన్లందరూ చేతులెత్తేయడంతో భారత్ 100 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లండ్ 246 పరుగులు చేయడం, భారత్ 146 పరుగులకే కుప్పకూలింది.