Site icon NTV Telugu

Rohit Sharma: దినేష్ కార్తీక్‌ను ముద్దు పెట్టుకున్న రోహిత్.. వీడియో వైరల్

Dinesh Karthik

Dinesh Karthik

Rohit Sharma: హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా చితక్కొట్టేసింది. అంచనాల మేరకు రాణించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మ్యాచ్‌తో పాటు సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దు పెట్టుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌ 8వ ఓవర్‌లో చాహల్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని మాక్స్‌వెల్ ఫైన్ లెగ్ దిశగా బాదాడు. అయితే బౌండరీ వద్ద అద్భుతంగా బాల్‌ను ఆపిన అక్షర్ పటేల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్ట్రైకర్ ఎండ్ వైపు బాల్ విసిరాడు.

Read Also: KA Paul: ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేస్తా..

అయితే రెండో పరుగు కోసం ప్రయత్నిస్తున్న మ్యాక్స్‌వెల్ ఆ బంతి నేరుగా వికెట్లను తాకుతుందని అస్సలు ఊహించి ఉండడు. అందుకే డైవ్ దూకలేదు. దినేష్ కార్తీక్ సైతం తొలుత గ్లవ్స్ వికెట్లకు తాకించడంతో ఒక బెయిల్ ముందే లేచింది. కానీ బాల్ నేరుగా వచ్చి వికెట్లకు తాకడంతో రెండో బెయిల్ కూడా లేచింది. దీంతో అంపైర్ పలుమార్లు రీప్లేను పరిశీలించి అవుట్ ఇచ్చాడు. కీలకమైన వికెట్ కోల్పోవడంతో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. కాగా ఈ మ్యాచ్‌లో నంబర్‌వన్‌ 3 పొజిషన్‌లో మరోసారి విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. దాదాపు మ్యాచ్ గెలుపు అంచులవరకు క్రీజులోనే ఉన్నాడు. కోహ్లీ 63 పరుగుల ఇన్నింగ్స్.. జట్టు విజయానికి వెన్నెముకలా నిలిచింది.

https://twitter.com/Heisenb02731161/status/1574042546900455424

Exit mobile version