Rohit Sharma : ప్లేఆప్స్ ప్రారంభమయ్యాయి.ఎలిమినేటర్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఇరు జట్లకు ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఓడిన జట్టుకు మరో అవకాశం లేకపోవడంతో, ఇంటిబాట పట్టాల్సిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ముంబై విజయ అవకాశాలపై ఆధారపడి ఉంది. ఈ సీజన్లో మూడు అర్ధసెంచరీలతో ఫామ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ కీలక ఎలిమినేటర్ లో రాణిస్తే ముంబైకి తిరుగుండదు. అదేవిధంగా ఈ మ్యాచ్ లో రోహిత్ పేరిట భారీ రికార్డ్ నమోదయ్యే అవకాశం ఉంది.
Read Also : Niharika Konidela: మా సినిమాను గుర్తించినందుకు థాంక్స్!
తన కెరీర్ లో ఇప్పటివరకు మొత్తం 270 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 298 సిక్సర్లు నమోదయ్యాయి. అంటే 300 మార్కు అందుకోవడానికి రోహిత్ మరో రెండు సిక్సర్లు బాదాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ 2 సిక్సర్లు కొడితే ఐపీఎల్ లో 300 సిక్సర్లు పూర్తి చేసుకుంటాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్‌లో గేల్ మొత్తం 357 సిక్సర్లు కొట్టాడు. గేల్ రికార్డు ప్రస్తుతానికి బద్దలయ్యేలా కనిపించడం లేదు.ఇక ఈ రేసులో విరాట్ కోహ్లీ పోటీ పడుతున్నాడు.కోహ్లీ 300 సిక్సర్లు పూర్తి చేయడానికి 9 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
Read Also : Niharika Konidela: మా సినిమాను గుర్తించినందుకు థాంక్స్!
