Site icon NTV Telugu

కొత్త కెప్టెన్సీ బాధ్యతల పై స్పందించిన హిట్ మ్యాన్…

భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20 జట్టుతో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు టైటిల్ విజేతలుగా నిలిపిన రోహిత్ జట్టును ముందుండి నడిపించాలని… ఆ తర్వాత వెన్నకి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే ఓ కెప్టెన్ ఎప్పుడు జట్టుకు సరైన ఆటగాళ్లు ఎంపిక చేయబడ్డారా.. లేదా.. జట్టు కూర్పు సరిగ్గా ఉందా.. లేదా అనేది గమనించాలి. ఇక కెప్టెన్ వెనుక ఉండాలి ఐ చెప్పిన రోహిత్.. అతను వెనకనుండి అందరికి గమనించగలడు అని అన్నాడు. అలాగే ఓ కెప్టెన్ పాత్ర లోపల కంటే బయటే ఎక్కువ ఉంటుంది. సరైన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. ఇక గౌండ్ లోకి వచ్చిన తర్వాత సమయం తక్కువ ఉంటుంది అని చెప్పాడు. అయితే రోహిత్ కు అంతర్జాతీయ కెప్టెన్‌ గా మంచి రికార్డు ఉంది. అతను ఇప్పటివరకు న్యాయకత్వం వహించిన 32 పరిమిత ఓవర్ల మ్యాచ్‌లలో 26 విజయాలు ఉన్నాయి.

Exit mobile version