Site icon NTV Telugu

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్.. నాలుగో ఆటగాడిగా రికార్డ్

Rohit Sharma Record

Rohit Sharma Record

Rohit Sharma Creates Record In IPL History: ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 6వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో.. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ ఫీట్ సాధించాడు. దీంతో.. ఐపీఎల్‌ చరిత్రలో 6వేల పరుగుల మార్క్‌ను అందుకున్న నాలుగో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ 6వేల పరుగుల మార్క్‌ని అందుకోవడానికి రోహిత్‌కి 226 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ (186 ఇన్నింగ్స్‌లు), శిఖర్‌ ధావన్‌(199 ఇన్నింగ్స్‌లు), డేవిడ్‌ వార్నర్‌(165 ఇన్నింగ్స్‌లు) ఈ ఫీట్ సాధించారు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ 6844 పరుగులతో (228 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. శిఖర్‌ ధావన్‌ 6477 పరుగులతో (210 మ్యాచ్‌లు) రెండో స్థానంలోనూ, డేవిడ్‌ వార్నర్‌ 6109 పరుగులతో (167 మ్యాచ్‌లు) మూడో స్థానంలోనూ ఉండగా.. రోహిత్‌ శర్మ 6014 పరుగులతో (232 మ్యాచ్‌లు) నాలుగో స్థానంలో ఉన్నాడు.

Karnataka Polls: కర్ణాటక ఎన్నికలు.. నామినేషన్లలో ఆసక్తికర ఘటనలు

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. కెమెరాన్ గ్రీన్ (64) అర్థశతకంతో చెలరేగగా.. తిలక్ వర్మ (37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు రోహిత్ శర్మ(28), ఇషాన్ కిషన్ (38) కూడా శుభారంభాన్ని ఇచ్చారు. తద్వారా ముంబై అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు.. 19.5 ఓవర్లలో 178 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ మొదట్లో నిదానంగానే సాగినా.. ఆ తర్వాత క్లాసెన్, మయాంక్ అగర్వాల్ ఊపందుకోవడంతో.. ఆశలు చిగురించాయి. ఒక్కసారిగా మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. కానీ.. చివర్లో వరుసగా వికెట్లు పడటంతో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది.

Exit mobile version