NTV Telugu Site icon

Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ నయా రికార్డు.. మోర్గాన్‌, విలియమ్సన్‌ వెనక్కి..

భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతోంది.. శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లోనూ విక్టరీ కొట్టి మరో సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.. ఇక, ఈ విజయంతో.. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.. స్వదేశంలో అత్యధిక విజయాలు నమోదు చేసిన కెప్టెన్‌గా మొదటి స్థానానికి దూసుకెళ్లాడు.. ఇప్పటివరకు భారత టీ20 కెప్టెన్‌గా రోహిత్‌ సొంతగడ్డపై 15 సార్లు జట్టుకు విజయాలను అందించాడు.. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌ విజయం రోహిత్‌కు కెప్టెన్‌గా 16వ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు.. దీంతో.. 15 విజయాలతో తనతో మానంగా ఉన్న ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, కేన్‌ విలియమ్సన్‌ వెనక్కి నెట్టేశాడు రోహిత్‌ శర్మ.

Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్‌పై భీకర దాడులు

ఇక, సొంత గడ్డపై టీ20 కెప్టెన్‌గా భారత్‌కు విజయాలు అందించినవారిలో తర్వాత స్థానంలో 13 విజయవాలతో విరాట్‌ కోహ్లీ, 10 విక్టరీలతో ఎంఎస్‌ ధోనీ ఉన్నారు.. ఆ ఇద్దరు టీమిండియా మాజీ కెప్టెన్‌లను ఎప్పుడో దాటేశాడు రోహిత్‌ శర్మ.. ఇక, ఓవరాల్‌గా టీ20ల్లో రోహిత్‌ శర్మకు కెప్టెన్‌గా 27 మ్యాచ్‌ల్లో.. ఇది 23వ విజయం కావడం మరో విశేషం. టీమిండియాకు టీ-20ల్లో వరుసగా ఇది 11వ విజయం. కాగా, నిన్న జరిగిన టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది భారత్‌.. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి.. రోహిత్‌ సేన ముందు 184 పరుగుల టార్గెట్‌ను పెట్టగా.. 17.1 ఓవర్లో కేవలం మూడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి విజయం సాధించింది భారత్.. దాంతో పాటు.. మరో మ్యాచ్‌ మిగిలిఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది.