NTV Telugu Site icon

న్యూజిలాండ్‌ సిరీస్‌ కు కెప్టెన్ గా రోహిత్…?

టీ 20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు విరాట్‌ కోహ్లీ. పని భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని క్లారిటీ ఇచ్చాడు. దాంతో తర్వాతి టీ ట్వీంటి కెప్టెన్సీ రేసులో ఎవరు ఉన్నారు అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీం ఇండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించాడు.

Read Also : అతనే టీం ఇండియా భవిష్యత్ కెప్టెన్ : గవాస్కర్

కోహ్లీ తర్వాత ఆ బాధ్యతలు రోహిత్‌ శర్మకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కోహ్లీ సారధ్యంలో టీ 20 మ్యాచ్‌లకు వైస్‌ కెఫ్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మకు పగ్గాలు అప్పగించే అవకాశముంది. అదే జరిగితే నవంబరులో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో రోహిత్‌ సారిథిగా పూర్తిస్థాయి బాధ్యతలతో టీమ్‌ను నడిపించనున్నాడు. ఇక కోహ్లీ సారధ్యంలో ఆడిన 45 టీ 20 మ్యాచుల్లో టీమిండియా 27 మ్యాచ్ లు గెలిచింది. 14 ఓటములను చవిచూసింది. రెండు మ్యాచ్‌లు టై కాగా… మరో రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి.