NTV Telugu Site icon

ద్రావిడ్ తో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది…

వైట్ బాల్ ఫార్మాట్ లో భారత జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ శర్మ ద్రావిడ్ తో కలిసి పని చేయడం అద్భుతంగా ఉంది అని అన్నారు. అయితే యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత హెడ్ కోచ్ గా రవిశాస్త్రి పదవికాలం ముగియడంతో ఆ బాధ్యతలను ది వాల్ రాహల్ ద్రావిడ్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అదే సమయంలో భారత టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. వీరిద్దరి కాంబినేషన్ లో జరిగిన మొదటి టీ20 సిరీస్ లో కివీస్ ను వైట్ వాష్ చేసారు.

అయితే తాజాగా రోహిత్ మాట్లాడుతూ… ద్రావిడ్ భాయ్‌తో కలిసి పని చేసింది కేవలం మూడు మ్యాచ్ లకే అయిన అది అద్భుతంగా ఉంది. ఆయన తన గేమ్ ఎలా ఆడాడు. అందులో ఎన్ని కష్టాలు పడ్డాడో అందరం చూసాం. అలాగే గతంలో నేడు ద్రావిడ్ తో నా వ్యక్తిగత ఆట గురించి కూడా చాలా చర్చలు జరిపాను. అయితే ద్రావిడ్ మాతో ఉంటె ఇంకా చాలా విలయాలు సాధిస్తాం అని తాను అనుకుంటున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు.