న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అదరగొడుతున్నారు. దీంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. తమ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ రోహిత్, గిల్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం వహిస్తున్నారు. రోహిత్ మొదట నెమ్మదిగా ఆడగా గిల్ మాత్రం బ్యాట్‌కు పనిచెప్పాడు. ఫెర్గుసన్ వేసిన రెండో ఓవర్లో ఫోర్‌తో బౌండరీల ఖాతా తెరిచిన గిల్.. అదే జోరు కొనసాగించాడు. ఇక ఫెర్గుసన్ వేసిన 8వ ఓవర్లో అయితే ఏకంగా నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 రన్స్ పిండుకున్నాడు. 10వ ఓవర్లో రెండు సిక్సర్లతో రోహిత్ కూడా టచ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 33 బంతుల్లో గిల్ అర్ధశతకం చేయగా.. రోహిత్ 41 బాల్స్‌లో 50 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. అనంతరం మరింత జోరు పెంచిన వీరిద్దరూ తమదైన శైలి బ్యాటింగ్‌తో రెచ్చిపోయారు. ఆసాంతం క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెంచరీ పూర్తి చేశాడు. కెరీర్‌లో రోహిత్‌కు ఇది 30వ వన్డే సెంచరీ. అనంతరం యంగ్ ఓపెనర్ గిల్ కూడా తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 72 బాల్స్‌లో శతకం బాదాడు. అయితే కాసేపటికే రోహిత్ 27వ ఓవర్లో బ్రేస్‌వెల్ చేతికి చిక్కాడు. దీంతో మొదటి వికెట్‌కు 212 పరుగులు భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
ఈ మ్యాచ్‌లోనూ గెలిచి టీమిండియా సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. నామమాత్రపు వన్డే కావడంతో జట్టులో రెండు మార్పుల్ని చేశారు. పేసర్లు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్‌కు అవకాశం కల్పించారు. ఈ వన్డేలో గెలిస్తే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా నెంబర్ వన్‌గా నిలుస్తుంది. ఈ ఏడాది చివర్లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అగ్రస్థానం టీమ్ కాన్ఫిడెన్స్ పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.