Roger Binny: బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ చేరడం కష్టమేనని రోజర్ బిన్నీ అభిప్రాయపడ్డాడు. తొలి మ్యాచ్‌లో టీమిండియా చేతిలో, రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంతో గ్రూప్‌లో టాప్-2లో పాకిస్థాన్ నిలవడం కష్టమేనని రోజర్ బిన్నీ అన్నాడు. ముఖ్యంగా ఈ మెగా టోర్నీలో జూనియర్ జట్లు బలంగా ముందుకు వస్తుండడం మంచిదేనని తెలిపాడు. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఐర్లాండ్, జింబాబ్వే తామేంటో నిరూపించుకున్నాయని.. ఇంగ్లండ్‌ను ఐర్లాండ్, పాకిస్థాన్‌ను జింబాబ్వే ఓడించడం వల్ల చిన్న జట్లు ఎంత ప్రమాదకరమో మరోసారి అన్ని జట్లకు తెలిసొచ్చిందని రోజర్ బిన్నీ పేర్కొన్నాడు.
Read Also: Milk Prices: సామాన్యుడికి మరో షాక్.. నవంబర్ 1 నుంచి విజయ పాల ధర పెంపు
చిన్న జట్లను పెద్ద జట్లు తేలిగ్గా తీసుకోకూడదని రోజర్ బిన్నీ హెచ్చరించాడు. తన అభిప్రాయం ప్రకారం పాకిస్థాన్ సెమీస్ చేరుకోవడం కష్టమేనని.. తాను వ్యక్తిగతంగా ఇదే జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. పాకిస్థాన్ సెమీస్‌కు రాకపోతే తనకు సంతోషమేనని పేర్కొన్నాడు. కానీ క్రికెట్ అంటే ఫన్నీ గేమ్ అని.. ఎప్పుడు ఏదైనా జరగొచ్చని అన్నాడు. గ్రూప్-2లో బంగ్లాదేశ్ ఇప్పటికే తన ఖాతాలో రెండు విజయాలు చేరడంతో పాయింట్ల పట్టికలో భారత్ తర్వాతి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా కూడా బలంగానే ఉంది. నెదర్లాండ్స్‌పై గెలిచినా పాకిస్థాన్ దక్షిణాఫ్రికాపై గెలిస్తేనే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అయితే నిలడకలేమితో ఇబ్బంది పడుతున్న పాకిస్థాన్ దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.
